బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

సాక్షి లైఫ్ : రక్త క్యాన్సర్‌లో రక్తం, ఎముక మజ్జ, లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి శోషరస వ్యవస్థలను ప్రభావితం చేసే వివిధ రకాల క్యాన్సర్‌లు ఉన్నాయి. అయితే అన్నిరకాల క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు ఒకేలా ఉంఉండే అవకాశం ఉంది. ఇవి కొందరిలో అస్పష్టంగా కనిపించవచ్చు లేదా ఇతర సాధారణ వ్యాధులను పోలి ఉండొచ్చు, కొంతమందిలో ఆయా సంకేతాలను ముందుగా గుర్తించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.. 

 అలసట.. 

 ఎటువంటి కారణం లేకుండా అలసట..నిరంతరం అలసట రక్త క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఈ అలసట తరచుగా తీవ్రంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా పోదు. 

తరచుగా అంటువ్యాధులు.. 

రక్త క్యాన్సర్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీని కారణంగా, ఆయా వ్యక్తి తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతాడు, దీని కారణంగా కోలుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది.

గాయాలు లేదా రక్తస్రావం.. 

దెబ్బలు తగిలినప్పుడు ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం కూడా బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు. రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే కణాలు, ప్లేట్‌లెట్స్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.

పక్కటెముకలలో.. 

 ముఖ్యంగా మెడ, చంకలు లేదా గజ్జలలో, రక్త క్యాన్సర్ రకం లింఫోమాకు సంకేతం కావచ్చు. కొన్ని రక్త క్యాన్సర్లు, ముఖ్యంగా మైలోమా, ఎముక నొప్పికి కారణమవుతాయి. ఈ నొప్పి ముఖ్యంగా వెన్ను లేదా పక్కటెముకలలో సంభవిస్తుంది, ఎందుకంటే ఎముక మజ్జ లోపల క్యాన్సర్ కణాలు పెరుగుతాయి.

రక్తహీనత.. 

రక్త క్యాన్సర్ ఎర్ర రక్త కణాలను గణనీయంగా తగ్గిస్తుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మైకము కలిగించవచ్చు. జ్వరం, రాత్రి చెమటలు: ఆకస్మికంగా జ్వరం, రాత్రి చెమటలు పట్టడం కూడా రక్త క్యాన్సర్ సంకేతాలలో భాగమే. 


ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : blood-cancer stomach-cancer cancer-types breast-cancer skin-cancer blood-cells red-blood-cells blood white-blood-cells blood-hemoglobin-test blood-cancer-awareness-month cancer-awareness-month blood-cancer-awareness-month-2024 cancer-awareness-month-2024
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com