సాక్షి లైఫ్ : సాయంత్రం అవుతోంది.. నారింజ తినకండి.. జలుబు చేస్తుంది. లేకుంటే సమస్య పెరుగుతుంది. ఇలాంటి అపోహలు మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి వింటూనేఉన్నాం.. అంతేకాదు, ఇలాంటి అపోహలు మన మనస్సుపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపాయంటే, నేటికీ చాలా మంది సాయంత్రం పూట లేదా జలుబు, దగ్గు ఉన్నప్పుడు నారింజ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. కానీ ఇందులో నిజం ఎంత..? అసలు వైద్యనిపుణులు ఏమంటున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
నారింజ తినడం వల్ల జలుబు చేస్తుందా.. ?
నారింజ తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందనేది ఒక అపోహ అని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది నిజమని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు అంటున్నారు. నారింజ పండ్లలో విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది.
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జలుబు తీవ్రతను కూడా తగ్గిస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. నారింజ తినడం వల్ల జలుబు చేస్తుంది. అనేది అపోహ మాత్రమే. అయితే పుల్లని పండ్లు రాత్రి సమయాల్లో తీసుకోకపోవడమే మేలనే అభిప్రాయం వినబడుతోంది.