World Tuberculosis Day 2026 : టీబీ సోకడానికి ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో 'క్షయ' (Tuberculosis) ఒకటి. ఇది కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు, అంటువ్యాధి కూడా. ఒకప్పుడు టీబీ అంటే నయం కాని వ్యాధి అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు సరైన అవగాహన, వైద్యం ఉంటే దీనిని పూర్తిగా జయించవచ్చు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది..? ఎవరికి ప్రమాదం ఎక్కువ..? అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ప్రధాన కారణం ఏమిటంటే..?

టీబీ రావడానికి ప్రధాన కారణం 'మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌కులోసిస్' (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియా. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అయితే, ఇది కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా మెదడు, వెన్నెముక, కిడ్నీలు , ఎముకలకు కూడా పాకవచ్చు. క్షయ వ్యాధి గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడిన ప్పుడు వెలువడే అతి సూక్ష్మమైన బిందువుల (Droplets) ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలో చేరుతుంది. పక్కనే ఉన్న ఆరోగ్యవంతులు ఆ గాలిని పీల్చినప్పుడు, బ్యాక్టీరియా వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది.

 ముప్పు ఎక్కువఎవరికి..?

శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ టీబీ రాదు. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే శరీరం ఆ బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. కానీ కింది పరిస్థితుల్లో ఉన్నవారికి ముప్పు ఎక్కువ:

 హెచ్‌ఐవీ, ఎయిడ్స్, క్యాన్సర్ బాధితులు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడేవారికి టీబీ త్వరగా సోకుతుంది.

మధుమేహం (Diabetes)...రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేని వారికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.

పోషకాహార లోపం..సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడలేకపోతుంది.

పొగత్రాగడం (Smoking) వల్ల ఊపిరితిత్తులు బలహీనపడతాయి. అలాగే మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన వారికి ముప్పు పొంచి ఉంటుంది. ఇరుకైన గదులు, గాలి వెలుతురు సరిగ్గా లేని ప్రదేశాల్లో ఉండటం వల్ల వ్యాప్తి వేగంగా జరుగుతుంది.

లక్షణాలను గుర్తించండిలా..

మూడు వారాలకు మించి తగ్గని దగ్గు.

దగ్గుతో పాటు రక్తం పడటం (Haemoptysis).

సాయంత్రం వేళల్లో స్వల్పంగా జ్వరం రావడం.

ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.

రాత్రిపూట చెమటలు పట్టడం, తీవ్రమైన అలసట.

 టీబీ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే 'డాట్స్' (DOTS) కేంద్రాన్ని సంప్రదించండి. పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. వైద్యులు సూచించిన కోర్సును మధ్యలో ఆపకుండా వాడటం అత్యంత ముఖ్యమని గమనించాలి.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tuberculosis tb-symptoms world-tuberculosis-day causes-of-tuberculosis what-causes-tuberculosis
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com