Benefits of Weight Loss : తాజా అధ్యయనం : స్థూలకాయులు వయసుతో సంబంధం లేకుండా బరువు తగ్గితే కలిగే ప్రయోజనాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసు పెరుగుతున్న కొద్దీ బరువు పెరగడం అనేది సర్వసాధారణం. అయితే, స్థూలకాయం లేదా అధిక బరువు కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు తరచూ హెచ్చరిస్తుంటారు. మరి, ముదిమి వయసులో అంటే 50 ఏళ్ల తర్వాత బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుందా..? ఇక బరువు తగ్గి లాభం లేదులే అని వదిలేయాలా..? అంటే.. కచ్చితంగా వదిలేయకూడదని, యాభైలో బరువు తగ్గినా గుండెకు ఎంతో మేలు జరుగుతుందని ఒక తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

లండన్ పరిశోధనలో కీలక విషయాలు..

స్థూలకాయులు వయసుతో సంబంధం లేకుండా బరువు తగ్గితే కలిగే ప్రయోజనాలపై 'యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL)' పరిశోధకులు ఇటీవల ఒక విస్తృత అధ్యయనం నిర్వహించారు. 1958లో జన్మించిన సుమారు 6,000 మంది ఆరోగ్య డేటాను వారు విశ్లేషించారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి:50 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యలో తమ శరీర బరువులో కనీసం 5 శాతం బరువు తగ్గిన వారిలో గుండె, జీవక్రియల (cardiometabolic health) ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది.

యాభై ఏళ్ల వయసులో బరువు తగ్గిన వారి శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు (bp), ఇన్ఫ్లమేషన్ (inflammation) తదితర ప్రమాదకర సూచికలు అదుపులోకి వచ్చాయి.ముఖ్యంగా, యవ్వనం నుంచి సరైన బరువును కాపాడుకుంటూ వచ్చిన వారి గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, 50 ఏళ్ల తర్వాత బరువు తగ్గిన వారి గుండె కూడా దాదాపు అంతే ఆరోగ్యంగా మారడం విశేషం.

నిపుణులు ఏమంటున్నారు..?

"వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం సహజమే అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా నిజం కాదు. 50 ఏళ్ల వయసులో బరువులో స్వల్ప మార్పులు చేసినా, అది దీర్ఘకాలంలో గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది" అని ఈ అధ్యయన ముఖ్య రచయిత్రి డాక్టర్ చారిస్ బ్రిడ్జర్ వివరించారు. వేగంగా బరువు పెరుగుతూ పోయే వారిలో జీవక్రియలు నెమ్మదిస్తాయని, తద్వారా హృద్రోగ సమస్యలు వేగంగా చుట్టుముడతాయని మరో పరిశోధకురాలు డాక్టర్ లారా గిమెనో హెచ్చరించారు.

అధిక బరువుతో బాధపడేవారు 'ఇక వయసు మళ్లింది, ఇప్పుడు బరువు తగ్గి ఏం లాభం' అని నిరాశపడాల్సిన అవసరం లేదు. బరువు తగ్గడానికి వయసుతో పన్లేదు. సరైన వ్యాయామం, ఆహార నియమాలతో ఎప్పుడైనా బరువు తగ్గి గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.