New Research : యువకుల మెదడు వికాసానికి నడకే దివ్యౌషధం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యుక్తవయసు (teenage) అనేది శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిపక్వతకు అత్యంత కీలకమైన సమయం. ఈ దశలో రోజువారీ శారీరక కదలికలు మెదడు ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని తాజా అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. యుక్తవయస్కులు రోజూ వేసే ప్రతి అడుగూ వారి మెదడు నిర్మాణాన్ని పటిష్ఠం చేయడమే కాకుండా, మానసిక సమస్యలను దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

12 వేల అడుగుల మంత్రం..

'జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్' జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక ప్రకారం.. రోజుకు 12,000 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు నడిచే టీనేజర్లలో ప్రవర్తనా లోపాలు, భావోద్వేగ సమస్యలు గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో క్రమం తప్పకుండా ఎక్కువ దూరం నడిచే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే ముప్పు అత్యల్పంగా ఉన్నట్లు తేలింది.

మెదడు నిర్మాణంలో సానుకూల మార్పులు..

అధికంగా నడిచే పిల్లలకు న్యూరో ఇమేజింగ్ (neuroimaging) పరీక్షలు నిర్వహించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శరీర కదలికలు, భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాల్లో కార్టికల్ కణజాలం (Cortical Tissue) మందం పెరిగినట్లు స్పష్టమైంది. ఇది మానసిక ఒత్తిడిని సమర్థంగా తట్టుకునే శక్తిని ఇవ్వడంతో పాటు జ్ఞాపకశక్తి, భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతుంది.

"మెదడు ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలు పెద్ద అథ్లెట్లుగా మారాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రోజూ నడుస్తున్నదానికంటే కేవలం 1,000 నుంచి 2,000 అడుగులు అదనంగా పెంచినా మెదడు ఆకృతి, పనితీరులో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది."-అమాండా పాలుచ్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ ఆమ్‌హెర్స్ట్.

పిల్లల్లో నడకను ఎలా ప్రోత్సహించాలి..?

స్క్రీన్ సమయానికి బ్రేక్.. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆరుబయట నడకను అలవాటు చేయాలి. చిన్న దూరాలకు నడకే మేలు.. సమీపంలోని పాఠశాలలు, దుకాణాలకు వాహనాలపై కాకుండా నడిచి వెళ్లేలా చూడాలి. కుటుంబ సమేతంగా మార్నింగ్ వాక్.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి రోజుకు కనీసం 20-30 నిమిషాలు నడవటం ద్వారా వారిని సులభంగా ప్రోత్సహించవచ్చు. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో మెట్లు ఎక్కే అలవాటును పెంపొందించడం ద్వారా రోజువారీ అడుగుల సంఖ్యను సులభంగా పెంచుకోవచ్చు. యుక్తవయసులో పడే చురుకైన అడుగులే.. వారి భవిష్యత్తు మానసిక పటిష్ఠతకు బలమైన పునాదులు వేస్తాయి.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.