Medical Miracle : వైద్యరంగంలో అద్భుతం..271 రోజుల పాటు మనిషి ప్రాణాలు నిలిపిన పంది కిడ్నీ..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా అవయవదానం కోసం ఎదురుచూస్తూ సకాలంలో అవయవాలు దొరకక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన దేశంలోనే ఏటా ఇలా సుమారు ఐదు లక్షల మంది మరణిస్తున్నారు. ఈ అవయవాల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాస్త్రం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అమెరికాలో ఓ వ్యక్తికి జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చి, అతడి ప్రాణాలను ఏకంగా 271 రోజుల పాటు వైద్యులు నిలబెట్టారు. ప్రపంచంలోనే ఇది తొలి 'బ్రిడ్జ్ ట్రాన్స్‌ప్లాంట్'గా చరిత్ర సృష్టించింది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

271 రోజుల పాటు..

అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ టైప్-2 డయాబెటిస్ కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నాడు. ఆయనకు వెంటనే మనిషి కిడ్నీ దొరికే అవకాశం లేకపోవడంతో, అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ బ్రిగమ్ ఆసుపత్రి వైద్యులు ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2025లో ఆయనకు పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మనిషి శరీరానికి సరిపోయేలా, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఆ పంది జన్యువుల్లో ఏకంగా 69 మార్పులు చేశారు.

ఈ కిడ్నీ 271 రోజుల పాటు అద్భుతంగా పనిచేసింది. ఆ తొమ్మిది నెలల పాటు ఆండ్రూస్‌కు ఎలాంటి డయాలసిస్ అవసరం రాలేదు. ఇంటి పనులు చేసుకుంటూ ఆయన సాధారణ జీవితం గడిపాడు.

'బ్రిడ్జ్ ట్రాన్స్‌ప్లాంట్' అంటే..?

ఆరు నెలల తర్వాత పంది కిడ్నీలోని రక్తనాళాలు దెబ్బతినడం ప్రారంభం కావడంతో వైద్యులు దాన్ని తొలగించి, కొద్దిరోజులు మళ్లీ డయాలసిస్ చేశారు. అప్పటికే ఆయనకు సరిపోయే మనిషి కిడ్నీ దొరకడంతో అక్టోబర్ 2025లో దాన్ని విజయవంతంగా అమర్చారు. ఒక రోగికి సరైన మనిషి అవయవం దొరికేంత వరకు, ప్రాణాపాయం లేకుండా తాత్కాలికంగా జంతువు అవయవాన్ని అమర్చి ప్రాణాలు నిలబెట్టడాన్ని వైద్య పరిభాషలో 'బ్రిడ్జ్ ట్రాన్స్‌ప్లాంట్' అని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటారు.

భవిష్యత్తులో.. 

ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో కిడ్నీ కోసం నిరీక్షించే లక్షలాది మందికి కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయని డాక్టర్ లియోనార్డో రియెల్లా తెలిపారు. సరైన అవయవం దొరికే వరకు రోగిని బతికించుకోవడానికి ఇవి తాత్కాలిక వంతెనలా ఉపయోగ పడతాయని ఆయన వివరించారు.

గతంలో చైనాలో బహుళ అవయవాల మార్పిడి..

 గతంలో చైనాలో బ్రెయిన్ డెడ్ అయిన 53 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి పంది కాలేయం (liver), కిడ్నీలను విజయవంతంగా అమర్చారు. జన్యుపరంగా అభివృద్ధి చేసిన ఆ పంది అవయవాలు మనిషి శరీరంలో సుమారు ఐదు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా అద్భుతంగా పనిచేశాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.