Research : మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందా..? ఈ సంకేతాలు గమనించండి..
సాక్షి లైఫ్ : మానసిక సమస్యలు ఒక్కసారిగా రావు... నిద్రలేమి, ఒత్తిడి, మనశ్శాంతి కరవవడం వంటి చిన్న లక్షణాలతో మొదలై క్రమంగా తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేన్ స్టేట్ యూనివ ర్సిటీకి చెందిన డాక్టర్ ఉమేకా స్టీఫెన్స్ ప్రకారం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఒత్తిడికి కారణాలేమిటో గుర్తించడం, దేనివల్ల మనసుకు ఊరట లభిస్తుందో తెలుసుకోవడం మొదటి అడుగు.
ఇది కూడా చదవండి..Leafy Greens : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? ఎందుకు..?
ఇది కూడా చదవండి..The 7-7-7 Formula : రోజుకు ఆ 21 నిమిషాలే.. పిల్లలతో మీ బంధాన్ని పెంచుతాయి..!
ఇది కూడా చదవండి..Herbal Tea : మాన్సూన్ లో ఉత్సాహంగా ఉంచే 5 హెర్బల్ టీలు..!
ఇది కూడా చదవండి..Simple Healthy Habits : అరవై దాటినా.. పడుచువారిలా ఉత్సాహంగా ఉండాలంటే..?
సాధారణ అలవాట్లే కీలకం..
సంక్లిష్టమైన పరిష్కారాల వెంట పరుగెత్తే ముందు, నిద్ర, తగినంత ఆహారం, నీళ్లు తాగడం వంటి ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి సరిగా పాటిస్తే మానసిక ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?
ప్రతికూల ఆలోచనలు, ఒత్తిడి ఆగకుండా కొనసాగి, అది డిప్రెషన్‌గా మారే సూచనలు కనిపిస్తే వెంటనే నిపుణుల సహాయం తీసుకోవాలి.
స్వీయ సంరక్షణ మర్చిపోవద్దు..
సినిమాలు చూడటం, విశ్రాంతి తీసుకోవడం, ఇష్టమైన పనులు చేయడం లాంటి చిన్న చిన్న అలవాట్లు కూడా ఒత్తిడిని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో మన భావోద్వేగాలు, అలవాట్లపై నిరంతరం శ్రద్ధ చూపడమే మంచి మానసిక ఆరోగ్యానికి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
