Painkiller side effects : తలనొప్పి వచ్చిన వెంటనే మాత్ర వేసుకుంటున్నారా..? జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చిన వెంటనే చేతికి అందిన మాత్ర వేసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. డాక్టర్‌ సలహా లేకుండా, మోతాదు గురించి ఆలోచించకుండా ఇలా మందులు వాడటం వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినా, దీర్ఘకాలంలో మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో నిశ్శబ్దంగా, నిరంతరం పనిచేసే అతి కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. వాటి ఆరోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Mental Health care : మానసిక ఆరోగ్యం: 44% మగవారు థెరపీలకు దూరం..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Protein Deficiency : ప్రోటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు..

ఇది కూడా చదవండి..Traditional Indian Snacks : వీటికి బదులు ‘దేశీ’ చిరుతిళ్లు తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

 

శరీరంలో ప్రతి రోజూ మూత్రపిండాలు అలుపెరగకుండా అనేక విధులు నిర్వర్తిస్తాయి. రక్తశుద్ధి..రోజుకు వందల లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి, అందులోని వ్యర్థ పదార్థాలను, విషతుల్యాలను వేరు చేస్తాయి. వ్యర్థాల తొలగింపు.. జీవక్రియల వల్ల ఏర్పడే వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. ఖనిజ సమతుల్యత.. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాల మోతాదును సమతుల్యంగా ఉంచుతాయి.

రక్తపోటు నియంత్రణ..శరీరంలో నీటి, ఉప్పు మోతాదులను నియంత్రించడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తి: ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసి, ఎముకల మజ్జలో ఎర్ర రక్త కణాల తయారీని ప్రేరేపిస్తాయి.'నిశ్శబ్ద వ్యాధి'గా పిలవడానికి కారణం ఇదే. 

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)ని వైద్యులు తరచుగా 'సైలెంట్ డిసీజ్' అని పిలుస్తారు. ఎందుకంటే మూత్రపిండాల పనితీరు గణనీయంగా క్షీణించే వరకూ చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్నాక మాత్రమే అలసట, వాపు, ఆకలి లేకపోవడం వంటి సంకేతాలు బయటపడతాయి. అప్పటికే మూత్రపిండాల సామర్థ్యం గణనీయంగా దెబ్బతిని ఉంటుంది.

ఈ అలవాట్లు మూత్రపిండాలకు శత్రువులే..

రోజువారీ జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మూత్రపిండాల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. విచక్షణారహితంగా నొప్పి నివారణ మందుల వాడకం: డాక్టర్ సూచన లేకుండా, తరచూ నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం మూత్రపిండాలపై అదనపు భారం మోపుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం..ఈ రెండు దీర్ఘకాలిక సమస్యలు నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల రక్తనాళాలు దెబ్బతింటాయి. అనారోగ్యకరమైన ఆహారం..ఉప్పు, నూనె, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.

సరిపడా నీరు తాగకపోవడం..శరీరంలో నీటి కొరత మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ధూమపానం, మద్యపానం రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపి, మూత్రపిండాలకు రక్తప్రసరణను తగ్గిస్తాయి.నిశ్చల జీవనశైలి.. శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దారితీసి పరోక్షంగా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

ముందుగానే గుర్తించడం సాధ్యమే..

లక్షణాలు కనిపించకముందే, సాధారణ రక్త, మూత్ర పరీక్షల ద్వారా మూత్రపిండాల ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. సీరమ్ క్రియాటినిన్ పరీక్ష, మూత్రంలో ప్రొటీన్ ఉనికిని పరీక్షించడం వంటివి మూత్రపిండాల పనితీరును అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వయసు మీద పడుతున్నవారు, మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారైనా ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూచనలు..


నొప్పి నివారణ మందులు, ఇతర మాత్రలను డాక్టర్ సలహా లేకుండా వాడకపోవడం ఉత్తమం. రోజువారీగా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు, నూనె తక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వాటిని నిత్యం అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.


క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మర్చిపోకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన అలవాట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడతాయి. తలనొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్ర వేసుకోకుండా, అవసరమైతే వైద్యుడిని సంప్రదించడమే మంచిది.

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.