Stomach Ulcer : స్టమక్ అల్సర్ అంటే ఏమిటి..? కారణాలు ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, సమయానికి భోజనం చేయక పోవడం వల్ల చాలామంది తరచుగా కడుపులో మంట, నొప్పితో బాధపడుతుంటారు. అయితే, వీటిని సాధారణ గ్యాస్ లేదా అజీర్తి సమస్యగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పదే పదే కడుపులో మంట, నొప్పి రావడం అనేది 'స్టొమక్ అల్సర్' (stomach ulcer)కు సంకేతం కావచ్చని బ్రిటన్‌కు చెందిన జాతీయ ఆరోగ్య సర్వీస్ (NHS) హెచ్చరిస్తోంది. అసలు ఈ అల్సర్ ఎందుకు వస్తుంది..? దీని లక్షణాలు, నివారణా మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

స్టమక్ అల్సర్ అంటే ఏమిటి..?
 
జీర్ణాశయం (Stomach) లేదా చిన్నప్రేగు పైభాగంలో లోపలి పొర దెబ్బతిని పుండ్లు పడటాన్ని 'స్టొమక్ అల్సర్' లేదా 'పెప్టిక్ అల్సర్' అంటారు. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు (Acids) ఈ పుండ్లకు తగలడం వల్ల తీవ్రమైన మంట, నొప్పి వస్తాయి.

ప్రధాన కారణాలు..?

అల్సర్‌లు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని ఎన్హెచ్ఎస్ (NHS) నిపుణులు చెబుతున్నారు.

హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori) బ్యాక్టీరియా.. చాలా కేసులలో అల్సర్ రావడానికి ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షనే ప్రధాన కారణం. ఇది కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది.

నొప్పి నివారణ మందులు (Painkillers)..?

ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs)ను వైద్యుల సలహా లేకుండా, దీర్ఘకాలం పాటు వాడటం వల్ల జీర్ణాశయ పొర దెబ్బతిని అల్సర్‌కు దారితీస్తుంది.

ఇతర కారణాలు..?

అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

గుర్తించడం ఎలా అంటే..?  

కడుపు మధ్య భాగంలో విపరీతమైన మంట, నొప్పి (ముఖ్యంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది).

కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, కడుపు ఉబ్బరం.

తరచుగా ఛాతీలో మంట (Heartburn), పుల్లటి తేన్పులు రావడం.

అజీర్తి, వికారం లేదా వాంతులు.

బరువు తగ్గడం, ఆకలి మందగించడం.

నివారణ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


అల్సర్ బారిన పడకుండా ఉండాలన్నా, ఉన్న సమస్యను తగ్గించుకోవాలన్నా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం:

సమయానికి భోజనం: ప్రతిరోజూ నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ సేపు కడుపును ఖాళీగా ఉంచకూడదు.

మసాలాలకు దూరం: కారం, మసాలాలు, వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.

నొప్పి మందుల వాడకం తగ్గింపు..సొంత వైద్యం కూడదు. తలనొప్పి, కీళ్ల నొప్పులకు తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడటం మానేయాలి. ఒత్తిడికి చెక్..యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

 

సాధారణంగా అల్సర్ మందుల ద్వారా నయమవుతుంది. కానీ, పరిస్థితి విషమించి అల్సర్ పగిలి రక్తస్రావం జరిగితే ప్రాణాపాయం కావచ్చు. కాబట్టి కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:వాంతుల్లో రక్తం పడటం లేదా కాఫీ రంగులో వాంతులు కావడం. మలం నల్లగా రావడం లేదా మలంలో రక్తం పడటం. ఆకస్మికంగా కడుపులో కత్తితో పొడిచినట్లు భరించలేని నొప్పి రావడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తరచుగా కళ్లు తిరిగి పడిపోవడం.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.