వర్షం కురిసే సమయంలో టీ, పకోడీ కలిపి తినకూడదా..?
సాక్షి లైఫ్ : టీతో పకోడాలు తినవచ్చా..? ఒకవేళ తింటే ఏమౌతుంది..? వర్షంలో పకోడీలు టీతో కలిపి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ సీజన్‌లో పకోడీలకు డిమాండ్ బాగా ఉంటుంది. ఇంట్లోనే కాకుండా బయట కూడా వీటిని వర్షం కురిసే సమయంలో కలిపి తీసుకుంటూ ఉంటారు.
ఇది కూడా చదవండి..మూత్రం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయా.. ?
టీతో పాటు పకోడీలు తినడంద్వారా గొప్ప అనుభూతి పొందుతారు. కానీ టీతో వేయించిన ఆహారాన్ని కలిపి తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీతో పాటు పకోడీలు తినడం ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
జీవక్రియ..
ఓ నివేదిక ప్రకారం.. టీతో పకోడీల కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. పకోడీలను డీప్ ఫ్రై చేయడం వల్ల అధిక మొత్తంలో నూనెను కలిగి ఉంటాయి. టీతో పకోడీలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వర్షాకాలంలో జీవక్రియ సహజంగానే మందగిస్తుంది. దీని కారణంగా సమస్య మరింతగా పెరుగుతుంది. శనగ పిండి పకోడాలు అజీర్ణ సమస్యలను కలిగిస్తాయి. టీతో పాటు పకోడీలు తినడం వల్ల శరీరంలో పోషకాహారం శోషణ మందగించవచ్చని పోషకాహారానిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఈ రెండిటినీ కలిపి తీసుకోకుండా ఉండడం మంచిది.
జంక్ ఫుడ్స్..
వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం అనేది ఏ సీజన్‌లోనూ ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు. నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పకోడీలు మాత్రమే కాదు, టీతో పాటు బిస్కెట్లు, జంక్ ఫుడ్స్ తినకూడదు. దీని కారణంగా శరీరానికి తక్కువ పోషకాలు అందుతాయి. పలు రకాల అనారోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. టీ, బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, బిపి, బెల్లీ ఫ్యాట్, ఎసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకునే ఆహారం, తాగే పానీయాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
