మూత్రం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయా.. ?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మూత్రం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయా? అనేది తెలుసుకోవడానికి గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. ఇందుకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూత్రం తాగడం వల్ల రక్తంలో బాక్టీరియా, టాక్సిన్స్, హానికరమైన పదార్థాలు శరీరంలోకి చేరుతాయని అనేక పరిశోధనల్లో రుజువైంది. మూత్రం తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. మూత్రం తాగడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు.

మధుమేహాన్ని నిర్ధారించేవాళ్లు..  

పూర్వకాలంలో వైద్యులు మూత్రం రుచిని బట్టి మధుమేహాన్ని నిర్ధారించేవారు. మూత్రం తాగే పద్ధతి వేల సంవత్సరాల నాటిది. నేడు దీనిని యూరిన్ థెరపీ, యూరోఫాగియా లేదా యూరోథెరపీ అని పిలుస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఆయుర్వేదంలో మూత్రం కూడా ఉపయోగిస్తారు. పురాతన రోమ్, గ్రీస్ ,ఈజిప్ట్ నుంచి వచ్చిన నివేదికలు మొటిమల నుంచి క్యాన్సర్ వరకు ప్రతిదానికీ మూత్ర చికిత్సను ఉపయోగించినట్లు చెబుతున్నాయి. ఒకప్పుడు వైద్యులు రుచిని బట్టి మూత్రంలో మధుమేహాన్ని చెక్ చేసేవారు.

 
ఓ నివేదిక ప్రకారం.. 33 ఏళ్ల యువకుడు తన మూత్రాన్ని తాగడం ప్రారంభించాడు. ఇది అతని శరీరంలోని అన్ని ఆరోగ్య సమస్యల నుంచి  బయటపడటానికి సహాయపడింది. అంతేకకాదు అతను హషిమోటోస్   థైరాయిడ్ వ్యాధి, దీర్ఘకాలిక నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందగలిగాడు.

రెండేళ్ల క్రితం తాను తన మూత్రాన్ని తానే తాగడం ప్రారంభించాననిఅతను చెబుతున్నాడు. దీనిని 'యూరిన్ థెరపీ'అని, యూరోఫాగియా అని కూడా అంటారు. మూత్రం తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని అతను చెబుతున్నాడు. ఇది ఆరోగ్య, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంతో పాటు చర్మానికి..

ప్రతిరోజూ తాజా మూత్రం తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయని కెనడాకు చెందిన 46 ఏళ్ల లేహ్ సాంప్సన్ వెల్లడించాడు. తాగే ముందు కాటన్ క్లాత్‌తో మూత్రాన్ని వడకట్టి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుందని,  మూత్రం తాగడం వల్ల తన బరువు వేగంగా తగ్గిందని చెప్పాడు.

మూత్రం తాగడం ప్రమాదకరమని చెబుతున్న వైద్యులు.. 

వైద్యులు మూత్రం తాగడం శరీరానికి ప్రమాదకరం అని చెబుతున్నారు. సహజంగా మూత్రంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని , దీనికారణంగా రెండు కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. యూరిన్ శరీరంనుంచి  బయటకు వ్యర్థాల రూపంలోనే వెళతాయి. అవి తాగితే అనారోగ్యానికి గురవ్వడమేకాకుండా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

యురోఫాగియా..

యురోఫాగియా భౌతిక ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. మూత్రం తాగడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం కొద్ది మొత్తంలో మూత్రం తాగడం వల్ల శరీరంలో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.