మహిళల ఆరోగ్య సంరక్షణలో వీటి పాత్ర కీలకం..
సాక్షి లైఫ్ : చర్మ సంరక్షణలో మెంతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళల సౌందర్య పోషణలో ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. బాగా మెత్తగా దంచిన మెంతిపొడిలో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఆతర్వాత కొద్దిసేపటికి నీటితో కడిగితే చర్మం చాలా సున్నితంగా మారుతుంది.
మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో సున్నితంగా శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం వలె పనిచేస్తాయి. శరీరంలో ఐరన్ లోపిస్తే మెంతులు తీసుకోవడంద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు. కఫం,దగ్గు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలకు మెంతులు సరైన పరిష్కారాన్ని అందిస్తాయి.
ఇది కూడా చదవండి.. అపోహలు - వాస్తవాలు: గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే చర్మ సమస్యలు వస్తాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
