ఇంటి చిట్కాలతో శరీరంపై ఉన్నమచ్చలు మాయం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంపై తగిలిన గాయాలు కొద్దిరోజుల తర్వాత క్రమంగా మచ్చలుగా ఏర్పడు తాయి. కొన్ని మచ్చలు అలానే ఉండిపోతాయి. కాబట్టి వాటిని తప్పనిసరిగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అయితే వీటిని తొలిగించడానికి అవసరమైన కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఆయా మచ్చలను శాశ్వతంగా నయం చేసుకోవచ్చు.. అందుకోసం ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..శ్వాస లేదా గుండె ఆగిపోతే సిపిఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చా..?

 

-కలబంద గుజ్జు, రోజా ్వటర్ రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని కాలిన చర్మా నికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మచ్చలు తొలిగిపోతాయి.

-పాలు, పసుపుని కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి కాలిన మచ్చ లున్న ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి.

-పసుపు, తేనె, చక్కెరని సమపాళ్లలో కలుపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరు చాలి. కొన్నిరోజులు ఇలానే చేస్తే మచ్చలు పోతాయి.


 ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు..

 టమాట గుజ్జు, పెరుగు, గుడ్డు తెల్లసొనని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో మచ్చలకి రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి. రోజుకి రెండుసార్లు చేస్తే త్వరగా మచ్చలు తొలిగిపోతాయి.

 

ఇది కూడా చదవండి..తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.