చలికాలంలో చర్మం పొడిబారకుండా ఇంటి చిట్కాలు.. 

సాక్షి లైఫ్ : చలికాలంలో చర్మం పొడిబారడం అనే సమస్య తలెత్తుతుంది. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీని కారణంగా మంట, దురద వంటి అనేక ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి సమస్యను పరిష్కారించాలంటే..? ఏమేం చేయవచ్చు.. అంటే..? ఇంట్లో లభించే పదార్థాలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. అందుకోసం కొన్ని సమర్ధవంతమైన మార్గాలు ఉన్నాయి..అవేంటంటే..? 

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

 

ముల్తానీ మట్టి మిశ్రమం..  

 ముల్తానీ మట్టి, పాల మీగడ, తేనె, బాదంనూనెను బాగా కలిపి ప్యాక్ రూపంలో ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మాయిశ్చరైజర్..  

 తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్నానం చేయడానికి ముందు శరీరానికి తేనెను అప్లై చేయండి. 10 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. తేనెలో ఔషధ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు రాకుండా నిర్మూలిస్తాయి.  

పెరుగుతో మర్దన..  

పెరుగును కాళ్లకు, చేతులకు రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత స్నానం చేయండి. పెరుగు పొడిచర్మాన్ని తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

కలబంద గుజ్జు.. 

 కలబందను ముక్కలుగా చేసి అందులోని గుజ్జును ముఖానికి రాయండి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ ప్రక్రియను రోజుకు రెండు సార్లు చేయడం వల్ల చర్మంపై దురద తగ్గుతుంది. అంతేకాదు పొడిబారు సమస్య తగ్గి, మృదువుగా ఉంటుంది. కలబందలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అవి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉండడమేకాకుండా, ఆరోగ్యంగా ఉండవచ్చు. 

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : home-remedies home-tips skincare-for-dry-skin acne-treatment-at-home home-remedy-for-dry-skin-in-winter-season beauty-tips-for-dry-skin-in-winter-season homemade-remedy-for-dry-skin-in-winter-season dry-skin-tips-for-winter-season dry-skin-during-winter dry-skin-in-winter tips-for-very-dry-skin-in-winter tips-for-dry-face-skin-in-winter beauty-tips-in-winter-for-dry-skin dry-skin-in-the-winter skin-care-tips-for-dry-skin-in-winter how-to-treat-dry-skin

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com