Survey Reveals Shocking Facts : మహిళల ఆరోగ్యంపై జీవనశైలి దెబ్బ: సర్వేలో షాకింగ్ నిజాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలు (diabetes) గణనీయంగా పెరుగుతున్నట్లు తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నివేదిక వెల్లడించింది. మునుపటి సర్వే (NFHS-5) ఫలితాలతో పోలిస్తే తాజా గణాంకాల్లో మహిళల జీవనశైలి వ్యాధులు భారీగా పెరిగినట్లు స్పష్టమైంది. అసమతుల్య ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడమే ఇందుకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

 

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో ఊబకాయం తీవ్రత గతంలో 23.8 శాతంగా ఉండగా, తాజా నివేదిక నాటికి అది 28.5 శాతానికి చేరింది. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉండటం లేదా మధుమేహానికి మందులు వాడుతున్న మహిళల శాతం 7.6 శాతం నుంచి ఏకంగా 11.7 శాతానికి పెరిగింది. పురుషుల్లోనూ ఈ సమస్య 10.9 శాతం నుంచి 13.6 శాతానికి ఎగబాకింది.

మరోవైపు పోషకాహార లోపం..

 ఓ వైపు అధిక బరువు సమస్య తీవ్రమవుతుండగా, మరోవైపు పోషకాహార లోపం కూడా పెరుగుతుండటం గమనార్హం. సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం గతంలో 15.9 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 18.3 శాతానికి చేరింది.

కారణాలు..?

జీవనశైలి మార్పులు: ఇంట్లో శారీరక కదలికలు తగ్గడం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, నూనెలు, అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు, షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతున్నాయి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు (fiber), పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు సమపాళ్లలో ఉండే సమతుల్య పోషకాహారాన్ని భాగం చేసుకోవాలి. తీపి పదార్థాలు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులతో సమస్యలు ముదరకుండా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.