ప్రతి 20 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ప్రకారం, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం కనుగొంది.2022 లోనే, దాదాపు 23 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
6.7 లక్షల మరణాలు సంభవించాయి. 2050 నాటికి, ఈ సంఖ్య ఏటా 32 లక్షల కొత్త కేసులు, 11 లక్షల మరణాలకు పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి 50 ఏళ్లు పైబడిన మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది, అటువంటివారు కొత్త కేసులలో 71శాతంఉండగా, మరణాల సంఖ్యలో 79శాతం ఉన్నారు.
బ్రెజిలియన్ శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ చికిత్స దిశలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న తేలు విషం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో అనేక పరీక్షలు, ప్రయోగాలు అవసరమవుతాయి, కానీ ఇది ఖచ్చితంగా కొత్త ఆశను రేకెత్తిస్తోంది. తేలు విషంతో తయారు చేసిన ఈ విధానం రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
