గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు-పరిష్కారాలు

షేర్ చేయండి:
గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు-పరిష్కారాలు

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు ఒక స్త్రీకి, మరొక స్త్రీకి భిన్నంగా ఉంటాయి. కొంతమంది మహిళలకు, ఈ ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది. కేవలంకొంతమంది మహిళలల్లో మాత్రమే ప్రెగ్నెన్సీ టైమ్ లో అనేక సమస్యలు వస్తాయి. 

అయితే ప్రతి స్త్రీని ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి మార్నింగ్ సిక్నెస్, మూడ్ స్వింగ్స్ , మలబద్ధక సమస్య. దీని కారణంగా శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. దీని గురించి సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే, అది చాలా తీవ్రమై కొత్త సమస్యగా మారుతుంది. గర్భధారణ సమయంలో పోషకాహారం అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. గర్భధారణ సమయంలో ప్రతి త్రైమాసికంలో మలబద్ధక సమస్య ఖచ్చితంగా తలెత్తుతుంది. 

 మొదటి త్రైమాసికంలో.. 

మొదటి త్రైమాసికంలో, ప్రొజెస్టెరాన్ పెరుగుదల, హార్మోన్ల మార్పులు జీర్ణవ్యవస్థను నెమ్మదింపచేస్తాయి. దీనికారణంగా మలబద్ధక సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి అధిక ఫైబర్ ఆహార పదార్థాలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

రెండవ త్రైమాసికంలో ముఖ్యమైన చిట్కాలు.. 

లోపల శిశువు పెరిగేకొద్దీ, గర్భాశయం ప్రేగులపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆకు కూరలు, బ్రోకలీ, క్యారెట్‌లను చేర్చండి. ఈ ఆహార పదార్థాలు సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే అవి పేగును ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియాను నిర్వహించడానికి పని చేస్తాయి. దీని కారణంగా జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. 

 మూడవ త్రైమాసికంలో మలబద్ధకాన్ని ఎలా ఎదుర్కోవాలి..? 

చివరి త్రైమాసికంలో పేగులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, శరీరం ప్రసవానికి సిద్ధపడడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆల్ బుకారా జ్యూస్ మలబద్ధక సమస్యకు సరైన పరిష్కారం. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇది మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా తగినంత నీరు తాగాలి. నీరు మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.

జీవనశైలిలో కొన్ని తేలికపాటి, సురక్షితమైన వ్యాయామాలు చేయడం వల్ల మలబద్ధక సమస్య తలెత్తదు. ఒకేసారి ఎక్కువ తినడానికి బదులు, రెండు సార్లుగా తినండి. ఏదైనా ఔషధం తీసుకునే ముందు, ఖచ్చితంగా మీ డాక్టర్ ను సంప్రదించండి.  

 ఇది కూడా చదవండి.. కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్ గురించి తెలుసా..?  
 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.