కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్.. గురించి తెలుసా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కోల్డ్ వాటర్ బెనిఫిట్స్.. చల్లటి నీటితో స్నానం చేయడం అనేది ఒక రకమైన థెరపీ.ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. వ్యాయామం తర్వాత మిమ్మల్ని రిఫ్రెష్ గా చేయడమేకాకుండా, రోగనిరోధక వ్యవస్థను , జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దాని ప్రత్యేకత ఏమిటంటే..? ఇది కొంత సమయం మాత్రమే చేయాలి. లేకపోతే ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోల్డ్ వాటర్ థెరపీ అంటే ఏమిటి..? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చొ తెలుసుకుందాం.. 

10 నుంచి 15 నిమిషాల పాటు 15° లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చల్లటి నీటితో స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని కోల్డ్ వాటర్ థెరపీ లేదా హైడ్రో థెరపీ అంటారు. 
 
 హైడ్రో థెరపీ.. 

డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది హైడ్రో థెరపీ. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. 

  కండరాల నొప్పి నుంచి ఉపశమనం.. 

సాధారణంగా సెలబ్రిటీలు లేదా క్రీడాకారులు చల్లటి నీటితో మాత్రమే స్నానం చేస్తారు. ఎందుకంటే చల్లటి నీరు రక్త నాళాలను తగ్గిస్తుంది, ఇది బాధాకరమైన ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, తద్వారా వాపు లేదా నొప్పిని తగ్గిస్తుంది. గాయం లేదా కండరాల ఒత్తిడికి గురైనప్పుడు ఐస్ వేయమని సలహా ఇవ్వడానికి ఇదే కారణం. శరీరాన్ని చాలా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీటిలో ముంచి కూర్చుంటే, తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది వాటర్ థెరపీ. 

 జీవక్రియ.. 

చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, ఫైటింగ్ కెమికల్స్ విడుదలవుతాయని, ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతాయనిపలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఇది 'ఫీల్ గుడ్' హార్మోన్. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి.. ఎక్కువ సార్లు మూత్రం నడవడానికి కారణాలివే.. 
 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.