పీసీఓడీ అంటే ఏమిటి..? కారణాలు..?
సాక్షి లైఫ్ : పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ) అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండడం వల్ల నెలసరి రాదు. దీని కారణంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. దీనినే "పీసీఓడీ" సమస్య అంటారు.
పీసీఓడీని ఎలా నివారించాలి..?
పీసీఓడీ సమస్యను నివారించడానికి కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా పీసీఓడీ సమస్యను నివారించవచ్చని, డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..?
మార్పులు తప్పనిసరి..
పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. ఈ రుగ్మత ఇటీవలకాలంలో మహిళల్లో సర్వసాధారణంగా మారింది. హార్మోన్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. పీసీఓడీ సమస్య కారణంగా అండాశయం నుంచి అండం విడుదల కాదు. దీని వల్ల నెలసరి కూడా రాదు.
ప్రధానంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్..
పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే చక్కెరతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
