పీఎంఎస్ ప్రాబ్లమ్ ఎలాంటి మహిళలకు వస్తుంది..?
సాక్షి లైఫ్ : మహిళలు నెలసరికి ముందు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటూంటారు. ప్రీ మెనుస్ట్రుల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అని దీనికి పేరు. రుతుక్రమానికి ముందు వచ్చే ఈ ఇబ్బందులు ఒక్కో మహిళలలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే.. మరికొందరికి అలసట, చిరాకు, నిరాశగానూ అనిపిస్తూంటుంది. మరికొందరిలో శరీరం బరువు తగ్గిన ఫీలింగ్ కూడా ఉంటుంది.
ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్..
ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురిలో రుతుక్రమానికి ముందు సమస్యలు ఉంటాయని అంచనా. ‘‘పీఎంఎస్‌తో బాధపడుతున్న వారిలో కొందరిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురయ్యే మహిళల్లో పీఎసంఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ’’ అని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని.
మహిళలు ఎదుర్కొనే గైనిక్ సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
