ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి వారికి వస్తుంది..? 

షేర్ చేయండి:
ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి వారికి వస్తుంది..? 

సాక్షి లైఫ్ : గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు వస్తాయా.. ? అసలు ఎందుకని ఇలా జరుగుతుంది..? హై బ్లడ్ ప్రెజర్, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా గుండె జబ్బులు త్వరగా వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పలు అధ్యయనాల ప్రకారం గుండె సంబంధ సమస్యలు రావడానికి మరో ప్రధాన కారణం ఉంది. 

ప్రీక్లాంప్సియా.. 

అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

నెలలు నిండకుండా.. 

గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8శాతం వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్‌లో 15శాతం అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని వైద్యులు చెబుతున్నారు.

ప్రీక్లాంప్సియా లక్షణాలు..? 

చేతులు, ముఖం వాచి ఉండటం
తలనొప్పి
మసక మసకగా కనిపించడం
కంటిలో నల్లటి మచ్చలు రావడం 
కడుపులో కుడివైపు నొప్పి
ఊపిరి ఆడకపోవడం

గర్భధారణ సమయంలో..

రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేయించుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. 

వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుంచి అధిక-తీవ్రత వర్కౌట్‌లు లేదా యోగా ఉంటాయి
ఎక్కువగా బరువు పెరగకుండదు

ఒత్తిడికి దూరంగా ఉండాలి
శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవాలి..
ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తే గర్భధారణ సమయంలో గుండె సంబంధిత సమస్యల తలెత్తవు. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.