ఈ వయస్సు వాళ్లు క్యాల్షియం ట్యాబ్లేట్స్ వేసుకోకూడదా..?
సాక్షి లైఫ్ : వయసును బట్టి శరీరంలో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. 25 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు రోజుకు1,000 ఎంజీ కాల్షియం అవసరం. 50 ఏళ్లు పైబడిన మహిళలు ఐతే రోజుకు 1,000-1,200 ఎంజీ వరకు క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న పురుషులకు రోజుకు1,000 ఎంజీ కాల్షియం అవసరం.
ఏ వయస్సువాళ్లకు క్యాల్షియం కావాలంటే..?
A.80 ఏళ్ల వయస్సు దాటినవాళ్లకు
B.50 ఏళ్ల వయస్సు లోపువాళ్లకు
C. 75 ఏళ్ల వాళ్లకు
D. 51-70 ఏళ్ల మహిళలకు
ఆన్సర్ : D. 51-70 ఏళ్ల మహిళలకు..
70 ఏళ్లు పైబడిన వాళ్ళకైతే రోజుకు1,000-1,200 ఎంజీ కాల్షియం అవసరం. క్యాల్షియం ట్యాబ్లేట్స్ పరగడుపున అస్సలు వేసుకోకూడదు. ఖచ్చితంగా భోజనం తర్వాతనే తీసుకోవాలి. అయితే క్యాల్షియం ట్యాబ్లేట్స్ లో రెండురకాల ట్యాబ్లేట్స్ ఉన్నాయి. వీటిలో క్యాల్షియం మాత్రమే ఉండే ట్యాబ్లేట్స్.. ఒకరకం అయితే , క్యాల్షియం తోపాటు విటమిన్ "డి" ఉండే ట్యాబ్లేట్స్ మరోరకం.
ప్రతి మనిషికి ప్రతిరోజూ రెండువేల ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ "డి " అవసరమవుతుంది. క్యాల్షియం ఒక్కటేఉండి విటమిన్ "డి " లేకపోతే వాడకూడదు. క్యాల్షియం ట్యాబ్లెట్ మాత్రమే వాడుతున్నప్పుడు "డి" విటమిన్ లోపం ఉంటే క్యాల్షియం ట్యాబ్లెట్ పనిచేయదు. కాబట్టి విటమిన్ "డి " టెస్ట్ చేయించుకొని నార్మల్ ఉంటే క్యాల్షియం ట్యాబ్లెట్ ఒక్కటే వాడొచ్చు. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు మాత్రమే క్యాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది.
క్యాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే వాడితే ఎముకలు బలంగా ఉండవు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా ఎముకలు దృఢంగా మారుతాయి. మెనుపాజ్ వయసులో ఉన్న మహిళలకు మాత్రమే క్యాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఇతరులకు కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మెదడును ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచే కార్యకలాపాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
