శరీరంలో సోడియం లెవల్స్ తగ్గితే ఏమౌతుంది..? 

షేర్ చేయండి:
శరీరంలో సోడియం లెవల్స్ తగ్గితే ఏమౌతుంది..? 

సాక్షి లైఫ్ : శరీరం అనేది వివిధ పోషకాలు, ఖనిజాల నుంచి శక్తిని పొందే వ్యవస్థ. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన మూలకం లేదా అధికంగా ఉన్నా,  తక్కువగా ఉన్నా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో సోడియం లెవల్స్ తగ్గడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 

అటువంటి ముఖ్యమైన పోషకాలలో ఒకటి సోడియం లేదా ఉప్పు. శరీరం బాగా పనిచేయడానికి కొంత మొత్తంలో సోడియం అవసరం. ఇది ప్రసరణ వ్యవస్థలో అంతర్భాగం. సోడియం రక్త నాళాల నుంచి కణాలకు పోషకాలు , ఖనిజాలను తరలించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? 

శరీరానికి కావాల్సిన సోడియం చాలా వరకు మనం రోజూ తినే ఉప్పు ద్వారానే లభిస్తుంది. శరీరంలో ఉప్పు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువ అయినా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో ఉప్పు తక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..? రోజుకు ఎంత ఉప్పు అవసరమో తెలుసా..? శరీరంలో ఉప్పు లోపిస్తే ఎలా గుర్తించవచ్చు..?  

ఉప్పు తగ్గితే..? 

ఎప్పుడూ ఎక్కువ ఉప్పు తీసుకోవడం గురించి ఆందోళన చెందుతాము కానీ దీనికి విరుద్ధంగా, శరీరంలో ఉప్పు తక్కువగా ఉంటే శరీరంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలు పడుతాయి..? నిరాశ, బలహీనత, వికారం, వాంతులు, మలబద్ధకం, తలనొప్పి, గందరగోళం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఉప్పు లోపించడం వల్ల మూర్ఛలు, కోమాకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.

సోడియం శరీరంలో ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది చాలా అవసరం. నిజానికి సోడియం కంటే ముఖ్యమైన ఖనిజం లేదు. ఇది శరీరం సహజంగా ఉత్పత్తి చేయలేని పోషకాహారం. ఒక వ్యక్తి రోజుకు 5గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ప్రధాన ఆరోగ్య సంస్థల లన్నీ చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.