ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి..?
సాక్షి లైఫ్ : మహిళలు అందంగా కనిపించేందుకు బ్యూటీ, కాస్మెటిక్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా కాస్మెటిక్ ,బ్యూటీ కేర్ ఉత్పత్తుల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తే హార్మోన్ల వ్యవస్థ ఆటంకాలు ఏర్పడడంతోపాటు, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి..విద్యార్థుల్లో మానసిక సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే..?
స్కిన్ క్యాన్సర్..
అంతే కాదు ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు సైతం హెచ్చరి స్తున్నారు. లిప్‌స్టిక్ వినియోగం వల్ల కూడా స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. నివేదికల ప్రకారం లిప్‌స్టిక్‌లలో కార్సినోజెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మాత్రమే కాదు, క్రోమియం, లెడ్, అల్యూమినియం, కాడ్మియం అనేక ఇతర టాక్సిన్స్ అనేక రకాల లిప్‌స్టిక్‌లలో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
సౌందర్య సాధనాలు-సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు..
ఇటీవల కాలంలో పలు సౌందర్య సాధనాలు, సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. పెర్ అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్థాలు (పీఎఫ్ఏఎస్)అనేవి సింథటిక్ ఆర్గానోఫ్లోరిన్ రసాయన సమ్మేళనాల సమూహం. వంటి చాలా ప్రమాదకరమైన రసాయనాలు లిప్‌స్టిక్‌లు, లోషన్‌లు, నెయిల్ పాలిష్‌లు, ఐషాడోలు, మాస్కరాలలో కలుపుతారు. సౌందర్య ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉండేలా చేయడానికి, వాటికి అనేక రకాల రసాయనాలు కలుపుతారు. PFAS అంటే పాలీఫ్లోరోయాసిల్ కూడా వాటిలో ఒకటి. ఇది కార్బన్, ఫ్లోరిన్‌తో తయారు చేస్తారు. ఇది త్వరగా విచ్ఛిన్నం కాదు. ఇది ఎక్కువగా సౌందర్య, వస్త్ర పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
