Winter Skin care tips : చలికాలం చర్మ సంరక్షణ: పొడిబారిన చర్మానికి మెరుపునిచ్చే ఫేస్ ప్యాక్‌లు..
సాక్షి లైఫ్ : చలికాలంలో వీచే చల్లని గాలులు, వాతావరణంలో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోయి పొడిబారుతుంది. నిర్జీవంగా మారిన ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవడానికి మన వంటింట్లో ఉండే పప్పు దినుసులే అద్భుతంగా పనిచేస్తాయి. పెసలు, మినప్పప్పు, శనగపప్పు వంటి వాటితో ఇంట్లోనే సహజసిద్ధమైన నలుగు పిండి లేదా ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. రసాయనాలకు బదులుగా చర్మానికి మేలు చేసే ఆ 5 రకాల పప్పుల ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
1. పెసరపప్పు ఫేస్ ప్యాక్..
సంప్రదాయ నలుగు పిండిలో పెసరపప్పును విరివిగా వాడుతుంటారు. దీని మెత్తని పొడి చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
తయారీ విధానం..పచ్చ పెసలు లేదా పెసరపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కలిపి మృదువైన పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖానికి సున్నితంగా రాసి, కొద్ది నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి.
2. మినప్పప్పు ఫేస్ ప్యాక్..
మినప్పప్పును నానబెట్టి రుబ్బడం వల్ల చిక్కని, మృదువైన పేస్ట్ తయారవుతుంది. ఇది చర్మానికి మంచి పోషణను అందిస్తుంది.
తయారీ విధానం.. రెండు చెంచాల మినప్పప్పును కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. కాసేపయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. కందిపప్పు ఫేస్ ప్యాక్..
మనం నిత్యం వంటల్లో వాడే కందిపప్పుతో కూడా ఇంట్లోనే సులభంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం.. కందిపప్పును బాగా ఎండబెట్టి లేదా నేరుగా మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కడిగేసి, ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. శనగపప్పు ఫేస్ ప్యాక్..
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో శనగపిండి పాత్ర ఎంతో కీలకం. ముఖంపై ఉండే మురికిని తొలగించడానికి ఇది చక్కటి ఇంటి చిట్కా.
తయారీ విధానం.. శనగపప్పును మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా కలపాలి. దీన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. అయితే, దీన్ని స్క్రబ్‌లా ముఖంపై గట్టిగా రుద్దకూడదు.
5. ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్..
ఎర్ర కందిపప్పు పొడిని కూడా పూర్వం నుంచి చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. అయితే, దీని రేణువులు కాస్త గరుకుగా ఉండే అవకాశం ఉన్నందున సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి.
తయారీ విధానం..రెండు చెంచాల ఎర్ర కందిపప్పును మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో నీళ్లు కలిపి మృదువైన పేస్ట్ తయారు చేసి ముఖానికి పట్టించాలి. కొద్ది నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి.
ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు..
ఏదైనా కొత్త ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాసే ముందు, చేతిపై కొద్దిగా రాసి ఎలర్జీ లేదని నిర్ధారించుకున్నతర్వాతే అప్లై చేసుకోండి..
పప్పుల పొడి బరకగా ఉంటే చర్మంపై గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిని జల్లించి, మృదువైన పేస్ట్‌లా మాత్రమే వాడాలి. ఫేస్ ప్యాక్‌ను మరీ ఎక్కువ సేపు ముఖంపై ఉంచి పూర్తిగా ఎండిపోనివ్వకూడదు. కొద్ది నిమిషాల్లోనే కడిగేయాలి.
ప్యాక్ తొలగించేటప్పుడు ముఖాన్ని గట్టిగా రుద్దకుండా, సున్నితంగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే చర్మంలోని తేమ ఆరిపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
