Study Warns : ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ తాజా అధ్యయనం.. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ‘బ్రెస్ట్ క్యాన్సర్’ ముప్పు..  

సాక్షి లైఫ్ : వైద్య రంగంలో ఎన్నో అత్యాధునిక చికిత్సలు అందుబాటు లోకి వస్తున్నప్పటికీ, మహిళలను వేధిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) ముప్పు భవిష్యత్తులో మరింత తీవ్రం కానుందని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షలుగా ఉన్న కొత్త కేసుల సంఖ్య, 2050 నాటికి ఏకంగా 35 లక్షలకు పైగా చేరుకోవచ్చని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ తాజా అధ్యయనం అంచనా వేసింది. ఈ మేరకు ప్రముఖ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ ఆంకాలజీ’లో కీలక వివరాలు వెల్లడయ్యాయి.

 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

పేద దేశాలపైనే ఎక్కువ భారం.. 

వ్యాధి బారిన పడటమే కాకుండా, దీనివల్ల సంభవించే మరణాల సంఖ్య కూడా 44 శాతం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో సుమారు 7.64 లక్షల మంది మహిళలు ఈ వ్యాధితో మరణించగా, 2050 నాటికి ఈ సంఖ్య 14 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ముఖ్యంగా వనరులు తక్కువగా ఉన్న వెనుకబడిన, మధ్య ఆదాయ దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడం, ఖరీదైన చికిత్సలు అందకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు కైలీ భాంగ్డియా పేర్కొన్నారు.

 ముప్పు తగ్గించుకోవచ్చు..


స్తన క్యాన్సర్ వల్ల కోల్పోయే ఆరోగ్యకరమైన జీవిత కాలాన్ని (Healthy Years), కేవలం జీవనశైలిలో మార్పుల ద్వారా 25 శాతం వరకు కాపాడుకోవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

నివారణ ఎలా..?

 ధూమపానం లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రతిరోజూ తగినంత శారీరక శ్రమ తప్పనిసరి. రెడ్ మీట్ (Red Meat) వినియోగాన్ని తగ్గించాలి. అధిక బరువు (BMI) పెరగకుండా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు.

యువతుల్లోనూ పెరుగుతున్న ముప్పు..  

సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, 1990 నుంచి ఇప్పటివరకు 20-54 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో కొత్త కేసుల రేటు 29 శాతం పెరగడం గమనార్హం. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి ఆరు ప్రధాన అంశాలు ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇందులో ఒక్క 'రెడ్ మీట్ ' వినియోగం వల్లే 11 శాతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది.

బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కేవలం అనారోగ్య సమస్య మాత్రమే కాదు, అది ఒక కుటుంబంపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : new-study breast-cancer study worldwide breast-cancer-treatment health-study
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com