Hormonal Imbalance : మహిళల్లో మానసిక సమస్యలకు హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కారణం కాదు..!

సాక్షి లైఫ్ : మహిళల్లో కనిపించే తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు కేవలం హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణం కాదని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా రుతుక్రమానికి ముందు వచ్చే 'పీఎం‌డీ‌డీ' (PMDD), మెనోపాజ్ సమయంలో కలిగే మానసిక ఆందోళనలకు శరీరంలోని కణజాలం స్పందించే తీరే కీలకమని పరిశోధకులు గుర్తించారు. మార్చి 4 నుంచి 6 వరకు జరిగిన అంతర్జాతీయ గైనకాలాజికల్ ఎండోక్రినాలజీ వార్షిక సదస్సులో ఈ వివరాలను వెల్లడించారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

 ‘పిఎం‌డి‌డి’ (PMDD)..?

రుతుక్రమానికి వారం రోజుల ముందు నుంచే చాలామంది మహిళల్లో విపరీతమైన చిరాకు, ఏకాగ్రత లోపించడం, అలసట, తీవ్రమైన విచారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని 'ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్' (PMDD) అంటారు. ప్రస్తుతం దీనిని గుర్తించేందుకు సరైన నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేవు.

పరిశోధన..

అమెరికాకు చెందిన పరిశోధకులు పీఎం‌డీ‌డీ ఉన్న మహిళలతో పాటు, మెనోపాజ్ దశలో డిప్రెషన్‌కు గురైన వారిపై ప్రత్యేకంగా  అధ్యయనం చేశారు. అలాంటి వారి నుంచి సేకరించిన రక్త నమూనాల ద్వారా ప్రయోగశాలలో రోగనిరోధక కణాలను (Lymphoblastoid cell lines) అభివృద్ధి చేశారు. కృత్రిమ పద్ధతుల్లో హార్మోన్ల స్థాయిలను మారుస్తూ.. వాటికి ఆ కణాలు ఎలా స్పందిస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు శాస్త్రవేత్తలు. అనంతరం వీరి జన్యువుల పనితీరును (Gene expression), సాధారణ మహిళల జన్యువులతో పోల్చి చూశారు.

కొత్త చికిత్సలకు మార్గం.. 

గతంలో ఈ సమస్యలకు హార్మోన్ల లోపమే కారణమని భావించి, ఆ లోపాన్ని సరిచేసే చికిత్సలు ఇచ్చేవారు. కానీ, ఈ పరిశోధన ద్వారా కణాల స్థాయిలో జరిగే మార్పులు, జన్యువుల పాత్రపై స్పష్టత వచ్చింది. తద్వారా భవిష్యత్తులో కేవలం హార్మోన్ మాత్రలే కాకుండా, కచ్చితమైన ఫలితాలను ఇచ్చే మరిన్ని అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hormonal-health hormone-therapy hormonal-imbalance hormones hormonal-changes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com