Omega-3 Is Essential for Women’s Health : మహిళల ఆరోగ్యానికి 'ఒమేగా-3' ఎందుకు అవసరం..? 90 శాతం మందికి తెలియని నిజాలు..!
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలిలో పోషకాహారం పాత్ర కీలకమైంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల శరీరతత్వానికి, హార్మోన్ల సమతుల్యతకు కొన్ని ప్రత్యేక పోషకాలు అత్యవసరం. అలాంటి వాటిలో 'ఒమేగా-3' ఫ్యాటీ యాసిడ్లు ప్రధానమైనవి. ఇవి కేవలం గుండె ఆరోగ్యానికే కాదు.. నెలసరి నొప్పుల నుంచి సంతానోత్పత్తి వరకు మహిళలకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
వీటిని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు..!
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (LA, EPA, DHA) అనేవి శరీరానికి అత్యవసరమైన కొవ్వులు. అయితే, మన శరీరం వీటిని సొంతంగా ఉత్పత్తి చేయలేదు. కాబట్టి, మనం తీసుకునే ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారానే వీటిని పొందాల్సి ఉంటుంది. మహిళలకు ఇవి ఎందుకు అంత ముఖ్యమో పరిశీలిస్తే..
1. నెలసరి నొప్పులకు చెక్..!
చాలామంది మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే ప్రధాన సమస్య నెలసరి తిమ్మిర్లు, నొప్పి. 2018లో జరిగిన ఒక వైద్య అధ్యయనం ప్రకారం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు తీసుకునే మహిళల్లో ఈ అసౌకర్యాలు గణనీయంగా తగ్గుతున్నాయని తేలింది. ఇవి సహజసిద్ధంగా పనిచేసి, నొప్పి నివారణ మందుల (Pain killers) అవసరాన్ని తగ్గిస్తాయి.
2. కీళ్ల వాతానికి విరుగుడు..
పురుషులతో పోలిస్తే మహిళల్లో 'రుమటాయిడ్ ఆర్థరైటిస్' వచ్చే అవకాశం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో కీళ్ల నొప్పి, వాపు వేధిస్తుంటాయి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఉదయం పూట కీళ్లలో ఉండే బిగుతు, వాపు తగ్గుతాయని 2017 సమీక్షా నివేదిక పేర్కొంది.
3. పునరుత్పత్తి, హార్మోన్లు..
సంతానం కోసం ప్రయత్నించే మహిళలకు ఒమేగా-3 ఒక వరమనే చెప్పాలి. అండం విడుదలకు (Ovulation) అవసరమైన హార్మోన్లను నియంత్రి స్తుంది. గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో అంతర్గత వాపును (Inflammation) తగ్గించి, పిండం ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
గుండె పదిలం..
గుండె స్పందన రేటును క్రమబద్ధీకరించడంలో, రక్తపోటును తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని చెడు కొవ్వులను తగ్గించడం ద్వారా ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి.
ఎలాంటి ఆహారం ద్వారా పొందాలి..?
ఒమేగా-3 సహజంగా లభించే ఆహార పదార్థాలు..సాల్మన్, ట్రౌట్, కాడ్ వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలు. అవిసె గింజలు (Flax seeds), చియా గింజలు, వాల్‌నట్స్, ఆకుకూరలు, సోయాబీన్స్ వంటి శాకాహారం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.