Typhoid Deaths : దేశవ్యాప్త టైఫాయిడ్ మరణాల్లో 19 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో టైఫాయిడ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి ఐదు టైఫాయిడ్ మరణాల్లో ఒకటి తెలంగాణరాష్ట్రంలోనే సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023లో రాష్ట్రంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా 202 మంది ప్రాణాలు కోల్పోయారని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
మరణాలు ఎక్కడెక్కడ ఎంత..?
దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతమే అయినప్పటికీ, టైఫాయిడ్ మరణాల్లో మాత్రం ఏకంగా 19 శాతం నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ (377 మరణాలు) మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ (118), ఢిల్లీ (36) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరణాలకు ప్రధాన కారణాలు ఏమిటంటే..?
అపరిశుభ్రమైన నీరు, ఆహారం.. స్ట్రీట్ ఫుడ్ (Street food), అపరిశుభ్రమైన తాగునీరు ఇన్ఫెక్షన్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. చాలామంది జ్వరం వచ్చిన 10 రోజుల వరకు ఆసుపత్రికి వెళ్లడం లేదు. ఆ సమయానికి యాంటీబయోటిక్స్ ప్రభావం చూపక పరిస్థితి విషమిస్తోంది. డాక్టర్ల సలహా లేకుండా సొంతంగా మందులు వాడటం వల్ల వ్యాధి ముదిరి అంతర్గత అవయవాలు దెబ్బతింటున్నాయి.
ముదిరితే ప్రమాదమే..
టైఫాయిడ్ ముదిరితే పేగుల్లో రంధ్రాలు పడటం (Intestinal perforation), సెప్సిస్, పలు అవయవాల వైఫల్యం (Multi-organ failure) వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మురికివాడలు, నిర్మాణ ప్రాంతాల్లో సరైన పారిశుధ్యం లేకపోవడం వల్ల ఈ వ్యాధి మరింత వేగంగా విస్తరిస్తోంది.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
