PG medical seats : తెలంగాణ రాష్ట్రంలో 75 కొత్త పీజీ మెడికల్ సీట్లు మంజూరు..

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) సీట్లను మంజూరు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపడటంతోనే ఈ అదనపు సీట్లు లభించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి..Vitamin Deficiency : నోరు, నాలుక మండుతోందా..? ఏ విటమిన్‌ల లోపం అయ్యి ఉండొచ్చు..? 

ఇది కూడా చదవండి..భారతదేశంలో కనిపించే టాప్ 10 విటమిన్ లోపాలు ఏమిటో తెలుసా..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

  ఏయే కళాశాలల్లో సీట్లు పెరిగాయి..?


ఉస్మానియా మెడికల్ కాలేజీ (Osmania Medical College), హైదరాబాద్.. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఈ 75 సీట్లు కింద 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మంజూరయ్యాయి.

సిమ్స్ రామగుండం (SIMS Ramagundam)

ఈ 75 అదనపు సీట్లతో, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 1,191 నుంచి 1,266కు పెరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు స్పెషలైజేషన్ చేసేందుకు ఇది గొప్ప అవకాశంగా అధికారులు తెలిపారు.

  ఏ విభాగాల్లో సీట్లు మంజూరయ్యాయంటే..?  

ఈ కొత్త సీట్లను వివిధ ముఖ్యమైన విభాగాల్లో కేటాయించారు. వాటిలో కొన్ని:

పీడియాట్రిక్స్ (Paediatrics): పిల్లల వైద్యం

DVL: చర్మం, లైంగిక వ్యాధులు, కుష్ఠు వ్యాధి

ENT: చెవి, ముక్కు, గొంతు

ఆర్థోపెడిక్స్ (Orthopaedics): ఎముకలు

అనస్థీషియా (Anaesthesia) 

పాథాలజీ (Pathology)

రెస్పిరేటరీ మెడిసిన్ (Respiratory Medicine): శ్వాసకోశ వైద్యం

బయోకెమిస్ట్రీ (Biochemistry)

ఎమర్జెన్సీ మెడిసిన్ (Emergency Medicine)

అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (Obstetrics and Gynaecology): ప్రసూతి & స్త్రీల వ్యాధులు

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (Hospital Administration)

మొత్తం వైద్య సీట్ల వివరాలు (తెలంగాణలో): తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,065 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు సుమారు 65 వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు (36): 4,315 సీట్లు, ప్రైవేట్ కళాశాలలు (29): 4,750 సీట్లు.. 

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news telangana-state telangana-state-government medical-professionals medical-regulations medical-innovation medical-services medical-update medical-news medical-information medical-education expansion-of-pg-and-ug-seats
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com