Africa's Cholera: ఆఫ్రికాలో కలరా మృత్యుఘోష..! 6,700 మరణాలు నమోదు..!

షేర్ చేయండి:
Africa's Cholera: ఆఫ్రికాలో కలరా మృత్యుఘోష..! 6,700 మరణాలు నమోదు..!

సాక్షి లైఫ్ : ఆఫ్రికా ఖండాన్ని కలరా మహమ్మారి చుట్టుముట్టింది. ఈ ఏడాది (2025) ఆరంభం నుంచి ఇప్పటి వరకు కలరా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య ఆరువేల ఏడువందలు దాటిందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Africa CDC) ప్రకటించింది. కలరా వ్యాప్తి చెందిన దేశాల సంఖ్య, నమోదైన మరణాల రేటు ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు ఆఫ్రికా సీడీసీ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

కలరా వ్యాప్తి ఆఫ్రికాలో ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం లేకపోవడం, నిరంతర సంఘర్షణలు, యుద్ధాల కారణంగా జనాభా భారీగా వలస రావడం కలరా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు పరిశోధకులు.

నివేదికలో..  

2025లో కలరా కారణంగా మరణించిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే చాలా ఎక్కువగా ఉందని Africa CDC స్పష్టం చేసింది. కలరా వ్యాధి వ్యాపించిన ఆఫ్రికా దేశాల సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యాధి నిర్వహణ, చికిత్స అందించడంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

 కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ (DRC), సుడాన్, దక్షిణ సూడాన్ వంటి దేశాలు అంతులేని సంఘర్షణలు, పేదరికం కారణంగా కలరా హాట్‌స్పాట్‌లుగా మారాయి. ఈ ప్రాంతాల్లో చికిత్స సకాలంలో అందకపోవడం వల్ల మరణాల రేటు (Case Fatality Rate) ఆందోళనకరంగా ఉంది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలను (WASH) మెరుగుపరచడం, నోటి ద్వారా తీసుకునే కలరా టీకా (OCV) కార్యక్రమాన్ని విస్తరించాలని Africa CDC ప్రపంచ దేశాలను కోరింది.

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.