CDSCO Issues Strong Warning : అనుమతి లేని ఐ డ్రాప్స్ తో జాగ్రత్త.! : కేంద్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థ (CDSCO) హెచ్చరిక

షేర్ చేయండి:
CDSCO Issues Strong Warning : అనుమతి లేని ఐ డ్రాప్స్ తో జాగ్రత్త.! : కేంద్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థ (CDSCO) హెచ్చరిక

సాక్షి లైఫ్ : కళ్ల కలక, పొడిబారడం వంటి సమస్యల కోసం వాడే కొన్ని రకాల ఐ-డ్రాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థ (CDSCO) రాష్ట్రాలను ఆదేశించింది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా మార్కెట్లోకి వచ్చిన 'సోడియం హయలురోనేట్ 0.3శాతం' (Sodium hyaluronate) ఐ-డ్రాప్స్‌పై అధికారులు కొరడా ఝుళిపించారు. వీటి తయారీ, విక్రయాలను వెంటనే నిలిపివేయాలని, సంబంధిత తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

 

సాధారణంగా కళ్లు పొడిబారినప్పుడు (Dry Eyes) ఉపశమనం కోసం కృత్రిమ కన్నీళ్లలా (Artificial tears) పనిచేసే డ్రాప్స్‌ను వాడుతుంటారు. అయితే, తగిన పరీక్షలు, అనుమతులు లేని మందుల వల్ల కంటికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అనుమతి లేని మందులలో నాణ్యత, ప్రమాణాలు ఉండవు.

అపరిశుభ్రమైన పద్ధతుల్లో తయారైన డ్రాప్స్ వాడటం వల్ల కళ్ల కలక వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తప్పుడు ఫార్ములేషన్ వల్ల కళ్లలో మంట పెరగడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.


వైద్యుని సలహా తప్పనిసరి.. 

సొంత వైద్యం ఎప్పుడూ ప్రమాదకరమే. కేవలం డాక్టర్ సూచించిన ఐ-డ్రాప్స్‌నే వాడాలి. గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాలి.  ఐ-డ్రాప్స్ సీసా తెరిచిన నెల రోజుల తర్వాత వాటిని వాడకూడదు. లోపల మందు మిగిలి ఉన్నప్పటికీ, కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున వాటిని పారేయడమే ఉత్తమం. నాణ్యత లేని కంటి మందులు కంటి పొరను దెబ్బతీస్తాయి. ప్రకటనలు చూసి మోసపోకుండా, కంటి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.