సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వేలాది కోళ్లు చనిపోవడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. రోగనిర్ధారణ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉన్నందున జిల్లాలో అవసరమైన ఆంక్షలు విధించారు. కోళ్లు చనిపోయిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలోని చికెన్ షాపులను మూడు రోజులు, కిలోమీటరు పరిధిలో ఉన్నవి మూడు నెలల పాటు మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) అని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే కాకుండా, మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పక్షులకు ముఖ్యంగా కోళ్లకు ప్రాణాంతకంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, నివారణ చర్యలు కొనసాగించాలని సూచించారు.
ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..?
ప్రభావిత ప్రాంతంలో H5N1 ఇన్ఫెక్షన్ వేగంగా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దేశీయ కోళ్లను ఉంచే ప్రదేశాలలో ఇది సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షి మలం, స్రావాలు లేదా నోటి నుంచి లేదా కళ్ళ నుంచి స్రావాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కాకుండా, సరిగా ఉడకని మాంసాన్ని తినడం వల్ల కూడా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఇన్ఫెక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తుంటే, నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
బర్డ్ ఫ్లూని ఎలా గుర్తించవచ్చు..?
బర్డ్ ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గు, విరేచనాలు, జ్వరంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, కండరాల నొప్పి, ముక్కు కారటం, గొంతు నొప్పి కూడా అనిపించవచ్చు. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని వేరే గదిలో ఉంచడం మంచిది. లేకపోతే మరొకరికి సోకే ప్రమాదం ఉంది. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్‌ని కొన్ని రకాల పరీక్షల సహాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవడం, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధుని నివారించడానికి సమర్థవంతమైన మార్గం అని వైద్యులు అంటున్నారు.
బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
బర్డ్ ఫ్లూ బారిన పడిన ప్రాంతాల్లో నివసించే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. అంతేకాదు కోళ్ల ఫారాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. ఒకవేళ బర్ద్ ఫ్లూ లక్షణాలు ఏమైనా కనిపిస్తే సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా మీరు తీవ్రమైన సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి.. వీగన్ డైట్‌తో నష్టాలు కూడా ఉన్నాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com