Chickenpox in Pune : పూణేలో చికెన్ పాక్స్ : పిల్లలతో పాటు పెద్దల్లోనూ పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు..
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూణే నగరంలో చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఇది చిన్న పిల్లలకే వస్తుందని భావిస్తారు, కానీ తాజా పరిస్థితుల్లో పెద్ద పిల్లలు, వయోజనులలో కూడా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గతంలో పోలిస్తే..
గతంలో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గతంలో టీకా తీసుకోని వారు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పెద్దల్లో ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు మరింత తీవ్రంగా ఉండి, ప్రాణాపాయం కలిగించే 'ఎన్సెఫలైటిస్' అంటే మెదడు వాపు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరోపక్క ఉరుగ్వే అధ్యక్షుడు యమందు ఓర్సీకి చికెన్ పాక్స్ భయం తప్పింది. ఆయనతో పాటు చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన అధికారిక బృందంలోని ఒకరికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో, అధ్యక్షుడికి కూడా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆయనకు నెగటివ్ అని తేలిందని ఆ దేశ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MSP) సోమవారం ప్రకటించింది.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
తొలి దశ: తక్కువ స్థాయిలో జ్వరం, తీవ్రమైన నీరసం, తలనొప్పి. రెండో దశ: శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, అవి క్రమంగా ద్రవంతో కూడిన బొబ్బలుగా మారడం. బొబ్బలు ఉన్న చోట విపరీతమైన దురద, మంట కలగడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వ్యాధి సోకిన వ్యక్తిని కనీసం ఒక వారం పాటు ప్రత్యేక గదిలో ఉంచాలి. వారు వాడే వస్తువులను ఇతరులు తాకకూడదు.పిల్లలకు రెండు డోసుల వారిసెల్లా టీకా ఇప్పించడం ద్వారా 90శాతం వరకు రక్షణ పొందవచ్చు. టీకా తీసుకున్న వారికి వ్యాధి సోకినా లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి.చలవ చేసే ఆహారం, కొబ్బరి నీళ్లు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కారం, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి.
జ్వరం కోసం ఆస్పిరిన్ వంటి మందులను వాడకూడదు. ముఖ్యంగా పిల్లలకు, ఇది ప్రమాదకరమైన 'రేస్ సిండ్రోమ్'కు దారి తీయవచ్చు. చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే నిపుణులైన పీడియాట్రిషియన్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించాలి. గోకడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత ముదిరి మచ్చలు పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
