Free IVF at Gandhi Hospital : గాంధీ హాస్పిటల్ లో ఫ్రీ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన దంపతులు..!

సాక్షి లైఫ్ : సంతానం కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్న ఒక పేద జంట కల గాంధీ ఆసుపత్రిలో నెరవేరింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అందించిన ఐవీఎఫ్ (In-Vitro Fertilization) చికిత్సతో బోయిగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్ రావు దంపతులకు కవలలు ఒక పాప, ఒక బాబు జన్మించారు. వ్యవసాయ కూలీలైన ఈ దంపతులు పిల్లల కోసం పదేళ్ల క్రితం తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు.

 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

గాంధీ ఆసుపత్రిలో..

ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు 13 సార్లు అండాల విడుదల ప్రేరణ (Ovulation Induction), ఒకసారి ఐయూఐ (IUI) చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించగా, అక్కడి వైద్యులు వీరికి ఉచితంగా చికిత్స ప్రారంభించారు.

ఉచితంగా అత్యాధునిక చికిత్స..

ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఐవీఎఫ్ చికిత్సను గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా అందించింది. మొదటి ఐవీఎఫ్ సైకిల్, గడ్డకట్టిన పిండం మార్పిడి (Frozen Embryo Transfer) ప్రక్రియల ద్వారా త్రివేణి గర్భం దాల్చారు. వైద్యులు సిజేరియన్ (LSCS) నిర్వహించి శిశువులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

గాంధీ ,పెట్లాబుర్జు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ ఐవీఎఫ్ కేంద్రాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా అత్యాధునిక సంతాన సాఫల్య చికిత్సలను అందిస్తున్నాయని వైద్య బృందం పేర్కొంది. మంత్రి దామోదర రాజనర్సింహ, ఆసుపత్రి ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వైద్యులను అభినందించారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health-care infertility-problems newborn-babies infertility gandhi-hospital-hyderabad ivf-treatment-cost
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com