సాక్షి లైఫ్ : ఢిల్లీలో రోజురోజుకీ గాలి నాణ్యత తగ్గుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కి చేరుకోవడంతో అక్కడి వాతావరణం అంధకారంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధానిలో అమలులో కఠినమైన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV పరిమితులు ఉన్నాయి. ఆంక్షలను ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు కోరింది. ఢిల్లీ అంతటా గాలి నాణ్యత క్షీణించింది, మంగళవారం ఉదయం అనేక ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు గాలి నాణ్యత సూచి 500 మార్క్ ను తాకాయి.
ఢిల్లీ-ఎన్‌సిఆర్..
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 కాలుష్య నియంత్రణలు.. ఈ చర్యలలో అవసరమైన వస్తువులను తీసుకువెళ్లడం లేదా ఎల్‌ఎన్‌జి, సిఎన్‌జి, బిఎస్-VI డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వంటి స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించడం మినహా ఇతర వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. ఎలక్ట్రిక్, సిఎన్ జి, లేదా BS-VI డీజిల్ ఉంటే తప్ప ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసిన వాణిజ్య వాహనాలు కూడా నిషేధించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
ఢిల్లీలో పొగమంచు ఉన్నప్పటికీ రైలు సేవలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక చర్యలు అమలుచేస్తున్నారు. కాలుష్యం కారణంగా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, తొమ్మిది రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ నివేదించింది.
గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి 12వ తరగతి వరకు విద్యార్థులకు తరగతులను నిలిపివేశారు. కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, జహంగీర్‌పురి, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంతో సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక మంగళవారం ఉదయం 500కి చేరుకుందని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నివేదించింది, ఇది ప్రజారోగ్యం,భద్రతపై ఆందోళనలను పెంచుతోందని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ-NCR ప్రాంతంలోని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం, ఫరీదాబాద్ ఆన్‌లైన్ తరగతులకు ముగింపు తేదీని ప్రకటించనప్పటికీ, నోయిడా,గురుగ్రామ్ నవంబర్ 23 వరకు తరగతులను నిలిపివేసాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం నవంబర్ 23 వరకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తుందని, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నవంబర్ 22 వరకు నిర్వహిస్తుందని ప్రకటించింది. రాజధానిలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి..ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com