Fatty Liver Alarms Hyderabad: హైదరాబాద్ నగరంలో ‘ఫ్యాటీ లివర్’ కలకలం..! ఐటీ ఉద్యోగుల్లో అత్యధికం..!

షేర్ చేయండి:
Fatty Liver Alarms Hyderabad: హైదరాబాద్ నగరంలో ‘ఫ్యాటీ లివర్’ కలకలం..! ఐటీ ఉద్యోగుల్లో అత్యధికం..!

సాక్షి లైఫ్ : ఫ్యాటీ లివర్ మన శరీరంలోకి నిశ్శబ్దంగా చొరబడుతోంది.. ప్రాణాల మీదకు తెస్తోంది.. ముఖ్యంగా ఈ కేసులు హైదరాబాద్ నగరవాసులు ఎక్కువగా వస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని దాదాపు 40.9 శాతం మంది వయోజనులు 'ఫ్యాటీ లివర్' (మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) బారిన పడుతున్నారని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది జాతీయ సగటు (38.9%) కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

ఆందోళనకరమైన గణాంకాలు..

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) దేశవ్యాప్తంగా 27 నగరాల్లో నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పురుషుల్లో 46 శాతం మందికి సమస్య, మహిళల్లో 36.2 శాతం మంది బాధితులు. గంటల తరబడి కూర్చుని పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య ఏకంగా 84 శాతం ఉన్నట్లు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) వెల్లడించింది.

కారణాలు ఏమిటి అంటే..?

మద్యపానం అలవాటు లేకపోయినా, కేవలం జీవనశైలి వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుండటం గమనార్హం. వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చోవడం. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, వేళాపాళా లేని భోజనం.

 అధిక బరువు ఉన్నవారికి సాధారణం కంటే 14 రెట్లు ఎక్కువ ముప్పు ఉంది. సన్నగా ఉన్నా, పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడం, మధుమేహం ఉండటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతోంది.

క్యాన్సర్‌కు దారితీసే ముప్పు.. 

లివర్ ఫ్యాటీగా మారడం వల్ల కాలక్రమేణా అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్.. చివరికి కాలేయ క్యాన్సర్ (HCC)కు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లివర్ క్యాన్సర్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 
 ప్రారంభ దశలో గుర్తిస్తే ఇది పూర్తిగా నయం చేయదగినదేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, క్రమం తప్పకుండా  వ్యాయామం చేయడం ద్వారా కొన్ని నెలల్లోనే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కృత్రిమ మేధ ఆధారిత స్క్రీనింగ్ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.