తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'ఫ్రైడే డ్రై డే' తప్పనిసరి..
సాక్షి లైఫ్ : తెలంగాణలో డెంగ్యూ, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. దోమల పెరుగుదలను అరికట్టేందుకు ప్రతి వారం 'శుక్రవారం డ్రై డే' (Friday Dry Day) పాటించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
డెంగ్యూ వ్యాప్తిపై ఆందోళన..
ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు డెంగ్యూ దోమల వృద్ధికి అనుకూలంగా మారాయి. ఈ నేపథ్యంలో, గృహాలు, కార్యాలయాల పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించి, దోమల సంతానోత్పత్తిని అరికట్టాలని ప్రజలను ఆరోగ్య శాఖ కోరింది.
డెంగ్యూ దోమలు పగటిపూట కూడా కుట్టే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులకు దోమ తెరలు అమర్చుకోవాలని, పడకలు, ఉయ్యాలలకు కూడా దోమల వలలు ఉపయోగించాలని సూచించారు. దోమల నివారణ మందులను వాడాలని, ఇంటి పరిసరాల్లోని మురుగునీటి కాలువల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణకు..
గ్యాస్ట్రోఎంటెరిటిస్, కామెర్లు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు కూడా పెరుగుతున్నందున, ప్రజలు మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. భోజనానికి ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానుకోవాలని సూచించింది.
గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తత..
వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫ్లుయెంజా వంటి గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. "అనారోగ్యంతో ఉన్నవారితో కరచాలనం చేయకుండా ఉండటం, చేతి శానిటైజర్లను ఉపయోగించడం, తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు రుమాలు ఉపయోగించడం వంటి ప్రాథమిక దగ్గు నియమాలను పాటించాలి" డాక్టర్లు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
