Jeevan Daan: జీవన్ దాన్ ద్వారా 'హ్యాండ్ ట్రాన్స్ ప్లాంట్' ట్రీట్మెంట్.. నిమ్స్, ఉస్మానియాల్లో సన్నాహాలు..
సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో అవయవ దాన కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఏర్పాటుచేసిన 'జీవన్ దాన్' సంస్థ మరో కీలక అడుగు వేస్తోంది. ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ఏడాది నుంచి 'చేతి మార్పిడి' (Hand Transplantation) శస్త్రచికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. దీంతో పాటు ప్యాంక్రియాస్ మార్పిడిని కూడా ఈ జాబితాలో చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
నిమ్స్ నుంచే శ్రీకారం..
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోటోకాల్స్ ఆధారంగా తెలంగాణలోనూ ఈ సేవలు ప్రారంభించనున్నారు. నిజామ్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)తో పాటు ఉస్మానియా (OGH) సహా మరో ప్రైవేట్ ఆసుపత్రి ఈ సేవల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాయి. మొదట నిమ్స్‌లో ఈ చికిత్సను ప్రోత్సహించి, అనంతరం ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలలకు విస్తరిస్తారు.
అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ..
సాధారణ అవయవ మార్పిడితో పోలిస్తే చేతి మార్పిడి అత్యంత అరుదైనది, క్లిష్టమైనది. ఒక చేతిలో ఎముకలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు, చర్మం, టెండన్లు ఇలా అనేక భాగాలు ఉంటాయి. శ్రమతో కూడుకున్నది.. సుమారు 25 రకాల కండరాలను అనుసంధానించాల్సి ఉండటంతో ఈ సర్జరీకి చాలా సమయం పడుతుంది. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రిలో ఒక చేయి లేదా రెండు చేతులు కోల్పోయిన 15 మంది రోగులు ఈ చికిత్స కోసం నమోదు చేసుకున్నారు.
అవయవ దానంలో తెలంగాణ రికార్డు..
గత ఏడాది 2025 తెలంగాణ అవయవ దానంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విషయం తెలిసిందే. జీవన్ దాన్ కార్యక్రమం కింద 205 మంది దాతల ద్వారా 758 అవయవాలు సేకరించారు. ఇందులో 291కిడ్నీలు,186 కాలేయాలు, 95 ఊపిరితిత్తులు, 32 గుండెలు ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ సగటు 0.8 ఉండగా, తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు అవయవ దాన రేటు 5గా ఉండటం విశేషం. కృత్రిమ చేతులు (Prostheses) అమర్చుకోవడానికి రూ. 60 వేల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఇవి బరువుగా ఉండటం వల్ల వాడకంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహజమైన చేతి మార్పిడి ద్వారా బాధితులకు మెరుగైన జీవితాన్ని అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
