కరోనా కొత్త వేరియంట్లు ఎన్నిరకాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు రెండు రకాలున్నాయి. వాటిలో LF.7 అండ్ NB.1.8.1 ఉన్నాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, దేశంలో JN.1 ప్రధాన వేరియంట్‌గా కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ఈ LF.7 , NB.1.8.1 వేరియంట్లను ఇంకా 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)' లేదా 'వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ (VOI)'గా వర్గీకరించలేదు.

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

కొత్త వేరియంట్లు కొంతవరకు రోగనిరోధక శక్తిని తప్పించుకోగలిగినప్పటికీ, అవి తీవ్రమైన, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయని సూచించ డానికి ఎటువంటి ఆధారాలు లేవని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ల లక్షణాలు ఎక్కువగా సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. వాటిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వంటివి ఉన్నాయి.

 అప్రమత్తమైన అధికారులు.. 

కొత్త కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల లభ్యతను పర్యవేక్షిస్తున్నారు వైద్యాధికారులు. వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.