సాక్షి లైఫ్ : హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నూతన ఆహార మార్గదర్శకాల ప్రకారం.. ఒక భారతీయుడు ప్రతిరోజూ 20 నుంచి 25 గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలి (ఒక టీస్పూన్ చక్కెర సుమారు 5.7 గ్రాములు). దీని కంటే ఎక్కువ చక్కెర ఆరోగ్యానికి హానికరం అని తెలిపింది. అయితే ప్రోటీన్ విషయంలో అయితే కిలోగ్రాము శరీర బరువుకు 1.6 గ్రాముల కంటే ఎక్కువగా ఈ పోషకాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం ఉండదు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? ఎంతవరకు నిజం..?
పరిశోధనలు..
గత కొన్ని దశాబ్దాలుగా, భారతీయుల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇవివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం యువకులలో తీవ్రమైన వ్యాధులు పెరుగుతున్నాయి. వారి ఆకృతిలో సైతం మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు అనుగుణంగా పలురకాల పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నూతన గైడ్ లైన్స్ రూపొందించారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు ఇవి కూడా కారణమేనా..?