సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తీవ్రంగా స్పందించింది. సరైన వసతులు, అధ్యాపకులు లేకపోయినా, మధ్యవర్తుల ద్వారా లక్షల రూపాయల లంచాలు ఇచ్చి అనుమతులు పొందుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్‌లకు ఎన్.హెచ్.ఆర్.సి. తక్షణమే విచారణ చేపట్టాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
న్యాయవాది ఫిర్యాదుతో..
హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ పత్రికా కథనాలను ఆధారంగా చేసుకుని జాతీయ మానవ హక్కుల సంఘంలో (NHRC) ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులోని ముఖ్యాంశాలు:
నాణ్యమైన విద్య లోపం.. నర్సింగ్ కళాశాలల్లో కనీస వసతులు, అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. మధ్యవర్తుల ద్వారా అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా అనుమతులు తెచ్చుకుంటున్నారు.
నిబంధనల ఉల్లంఘన... ఒక చోట పర్మిషన్ తీసుకుని మరో చోట కళాశాల ఏర్పాటు చేయడం, ఒకే భవనంలో ఏకంగా 8 కళాశాలల నిర్వహణకు అనుమతులు పొందడం వంటి తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం..ఈ అక్రమాలపై ప్రభుత్వం కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటోందని, దీనిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయవాది రేవంత్ డిమాండ్ మేరకు, విద్యార్థుల విద్యా హక్కు (Right to Education) ప్రకారం నాణ్యమైన విద్యను అందించేందుకు చొరవ తీసుకోవాలని NHRCని కోరారు.
NHRC కఠిన ఆదేశాలు..
న్యాయవాది రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం, విద్యార్థుల హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అండ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్‌లు తక్షణమే పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది.
దోషులపై చర్యలు..
అనుమతి లేని కళాశాలలు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, మధ్యవర్తులు, ఈ భాగస్వాములందరిపైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకున్న చర్యల గురించి పూర్తి నివేదికను నాలుగు వారాల్లోపు జాతీయ మానవ హక్కుల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నర్సింగ్ కళాశాలల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.