మధుమేహ ప్రమాదాన్ని ముందుగా గుర్తించేందుకు సరికొత్త ప్రయోగం..
సాక్షి లైఫ్ : మధుమేహ సమస్య ఒక్కసారి వచ్చిందంటే..? జీవితాతంతం దానిని ఎదుర్కోవాల్సిందే.. పూర్తిగా నిర్మూలించడం దాదాపు కష్టమే. అయితే అందుకోసం ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వచ్చాక బాధపడేకంటే అసలు మధుమేహ సమస్య రాకముందే ఎలా గుర్తించాలి..? అందుకోసం ఏమి చేయాలనే దానిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎమ్ డిఆర్ ఎఫ్) ప్రత్యేకంగా దృష్టి సారించాయి. అందులో భాగంగా ఈ రెండు సంస్థల సహకారంతో చెన్నైలో దేశంలోని మొట్టమొదటి డయాబెటిస్ బయోబ్యాంక్‌ను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి..ఆలుగడ్డలు తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో టాన్సిల్స్ కు పరిష్కార మార్గాలు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
మధుమేహ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు. అందుకోసం దేశంలో మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్‌ను ఏర్పాటుచేశారు. ఐసీఎమ్ఆర్ దేశంలోనే మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్‌ను రూపొందించింది. దీంతో మధుమేహం ముప్పును ముందుగానే గుర్తించవచ్చు. దేశవ్యాప్తంగా సేకరించిన మధుమేహ రోగుల డేటా ఈ బయోబ్యాంక్‌లో అందుబాటులో ఉంది.
దేశంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు మధుమేహ బాధితులుగా మారుతున్న తరుణంలో ఈ బయోబ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో 11 కోట్ల మందికి పైగానే డయాబెటీస్ తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిని నిర్మూలించడంతోపాటు జనాలకు దీనిపై అవగాహన కల్పించనున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
