హెచ్ఎంపివి వ్యాప్తితో అప్రమత్తమైన భారత్.. 

షేర్ చేయండి:
హెచ్ఎంపివి వ్యాప్తితో అప్రమత్తమైన భారత్.. 

సాక్షి లైఫ్ : చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఆపమత్తమైంది. చైనాలోని ఆసుపత్రులలో రోగులు భారీ క్యూలో నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ అంశంపై చైనా దేశ నిపుణుల సమావేశంలో అక్కడి పరిస్థితిపై చర్చించారు. చైనాలో పరిస్థితి గురించి సకాలంలో సమాచారాన్ని అందించాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూ హెచ్ ఓ)ను కోరింది.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

చైనాలో నిరంతరం పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత, చైనాలో ఉద్భవించిన ఈ వ్యాధిపై భారతదేశం మునుపటి కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంది. చైనాలో పరిస్థితి గురించి సకాలంలో సమాచారాన్ని అందించాలని భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది.

ఆరోగ్య సేవల డిజి అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో చైనాలో తాజా పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయా వైరస్ ను అడ్డుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు అవసరం..? అనేదాని గురించి చర్చించారు.

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

నిపుణుల సమావేశం..  

ప్రపంచ ఆరోగ్య సంస్థ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎయిమ్స్‌తో సహా అనేక పెద్ద ఆసుపత్రుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఫ్లూ సీజన్‌లో శ్వాసకోశ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతాయని, ఇది సాధారణంగా చలికాలంలో ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు అంగీకరించారు. దీనికి కారణం ఈ సీజన్‌లో వేగంగా వ్యాపించే ఇన్‌ఫ్లుఎంజా వైరస్, ఆర్‌ఎస్‌వి, హెచ్‌ఎంపివి కావచ్చునని కూడా నివేదిక పేర్కొంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.