పాకిస్థాన్‌, స్వీడన్‌లలో మంకీ పాక్స్ కొత్త కేసులు..   

షేర్ చేయండి:
పాకిస్థాన్‌, స్వీడన్‌లలో మంకీ పాక్స్ కొత్త కేసులు..   

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వ్యాధి 500 మందికి పైగా మరణాలకు, 15,000 మందికి పైగా అనారోగ్యానికి కారణమైంది. తాజాగా ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికాలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. పాకిస్థాన్‌లో తొలి ఎంపాక్స్ కేసు రికార్డైంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయం ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 34 ఏళ్ల వ్యక్తి ఆగస్టు 3వ తేదీన సౌదీ అరేబియా నుంచి పాకిస్థాన్‌కు వచ్చాడు. అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడడంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ ధృవీకరించింది.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 స్వీడన్‌లో కూడా ఇటీవల తొలి ఎంపాక్స్ కేసు నమోదైంది. రాజధాని స్టాక్‌హోమ్‌కు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ వైరస్ కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో వ్యాప్తి చెందగా, ఆఫ్రికా వెలుపల వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి అని స్వీడన్ ప్రజారోగ్య విభాగం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాధిని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ, 'ఎమర్జెన్సీ కమిటీ సూచన మేరకు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నాం' అని తెలిపారు. 

ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీచేసింది.  

ఇది కూడా చదవండి..ఎంపాక్స్ లక్షణాలను ఎలా గుర్తించాలి..? నివారణ ఎలా..?

 

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.