Regulations Flouted: ఏఐ నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యథేచ్ఛగా నిషేధిత మందుల కొనుగోలు..

షేర్ చేయండి:
Regulations Flouted: ఏఐ నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యథేచ్ఛగా నిషేధిత మందుల కొనుగోలు..

సాక్షి లైఫ్: ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నకిలీ ప్రిస్క్రిప్షన్ల వ్యవహారం మరింతగా పెరుగుతోంది. వైద్య నిబంధనలు బేఖాతరు చేస్తూ అడ్డదిడ్డంగా మెడిసిన్స్ వాడుతున్నారు కొందరు. ఒకప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్స్ ఉంటేనే లభించే మందులు.. ఇప్పుడు కేవలం ఒక ‘క్లిక్’తో మత్తు లోకంలోకి నెడుతున్నాయి. కృత్రిమ మేధ (artificial intelligence) సాంకేతికతను ఆసరాగా చేసుకుని నకిలీ ప్రిస్క్రిప్షన్లను సృష్టించి, నిషేధిత మందులను సైతం యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. సాధారణ యాంటీబయాటిక్స్ నుంచి ప్రాణాంతకమైన మత్తు బిళ్లల వరకు ఏది కావాలన్నా నిమిషాల్లో నకిలీ ప్రిస్క్రిప్షన్స్ సిద్ధమవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..

 

‘ఏఐ’ వినియోగం..

ఇటీవల ఒక రోగి కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన నకిలీ ప్రిస్క్రిప్షన్ చూపి యాంటీబయాటిక్స్ వాడటాన్ని గుర్తించిన వైద్యులు విస్తుపోయారు. దీనిపై లోతుగా పరిశీలించగా విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాట్‌బాట్‌ల ద్వారా ప్రముఖ ఆసుపత్రుల పేర్లు, లోగోలు, వైద్యుల సంతకాలను పోలి ఉండేలా నిమిషాల్లో ప్రిస్క్రిప్షన్లను తయారు చేస్తున్నారు. ఏఐ సాధనాలు నేరుగా నిరాకరించినా, కొందరు చాకచక్యంగా సమాచారాన్ని మార్చి వీటిని పొందుతున్నారు.

సులభంగా మత్తు మందులు..

నకిలీ ప్రిస్క్రిప్షన్ల ద్వారా విక్రయిస్తున్న మందుల జాబితా ఆందోళన కలిగిస్తోంది. యాంటీబయాటిక్స్.. అజిత్రోమైసిన్, నార్‌ఫ్లాక్స్ వంటివి ఇష్టానుసారంగా వాడటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతోంది. మత్తు కలిగించేవి.. తీవ్రమైన నొప్పి నివారణకు వాడే 'ట్రామడాల్' వంటి ఓపియాయిడ్లు మత్తు కోసం వాడుతున్నారు. మానసిక వ్యాధుల మందులు..ఆందోళన తగ్గించే 'ఆల్‌ప్రాక్స్' వంటి మందులు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కొనుగోలు చేస్తున్నారు.నిషేధిత డ్రగ్స్.. ప్రభుత్వం నిషేధించిన 'నిమెసులైడ్ 200' వంటివి కూడా ఈ అడ్డదారిలో అందుబాటులోకి వస్తున్నాయి.

వ్యవస్థలో లొసుగులు..

ఆన్‌లైన్ ఫార్మసీలు, కొన్ని రిటైల్ మందుల దుకాణాలు ప్రిస్క్రిప్షన్ల నకిలీవా..? ఒర్జినలా..? అనేవి సరిచూడకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తనిఖీ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని మాదకద్రవ్యాల ముఠాలు, యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సలహా లేకుండా వాడే మందులు ప్రాణాలకే ప్రమాదం. నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి శిక్షార్హమైన నేరంమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..??

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.