Shigella Outbreak in Kerala : కేరళలో షిగెల్లా కలకలం.. కోజికోడ్ జిల్లాలో వ్యాప్తి..

షేర్ చేయండి:
Shigella Outbreak in Kerala : కేరళలో షిగెల్లా కలకలం.. కోజికోడ్ జిల్లాలో వ్యాప్తి..

సాక్షి లైఫ్ : కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా తీవ్ర కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో తాజాగా 12 మందికి షిగెల్లా సోకినట్లు నిర్ధారణ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ వ్యాధి లక్షణాలతో ఒక చిన్నారి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా నమోదైన కేసులతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

కుటుంబ సభ్యులకు వేగంగా వ్యాప్తి.. 

పెరువయల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎరంజికల్ ప్రాంతంలో అధికారులు ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇప్పటికే వ్యాధి బారిన పడిన వారి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. దీనిని బట్టి వ్యాధి ఒకే ప్రాంతంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

రంగంలోకి వైద్య బృందాలు.. 

వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వైద్య బృందాలు ఎరంజికల్, పూవట్టుపరంబ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి, నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. బావుల్లోని నీటిని శుద్ధి చేసేందుకు క్లోరినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు.

ఆహార భద్రతపై నిఘా.. 

వ్యాధి వ్యాప్తికి అపరిశుభ్రతే ప్రధాన కారణమని భావిస్తున్న తరుణంలో ఆహార భద్రతా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న హోటళ్లు, దుకాణాలు తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.