Study : గర్భధారణలో కొవిడ్ సోకితే.. బిడ్డకు ఆటిజం..

షేర్ చేయండి:
Study : గర్భధారణలో కొవిడ్ సోకితే.. బిడ్డకు ఆటిజం..

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లుల పిల్లల్లో నాడీ సంబంధిత (Neurodevelopmental) సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని అమెరికా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో కొవిడ్ సోకిన తల్లులకు జన్మించిన పిల్లలు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి ఆటిజం, మాట్లాడలేకపోడం వంటి విషయాలలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఆటిజం, మాట్లాడలేకపోడం వంటి సమస్యలు లేని తల్లుల పిల్లలతో పోలిస్తే, కొవిడ్ సోకిన తల్లుల పిల్లల్లో ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లికి కరోనా వైరస్ సోకినప్పుడు, అది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చని, ముఖ్యంగా తల్లి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే తీరు దీనికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ముప్పు ఉన్నప్పటికీ, కొవిడ్ సోకిన తల్లుల పిల్లల్లో కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువే అని, ఈ కొత్త విషయాల గురించి అవగాహన ఉండటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. సరైన సమయంలో ఈ సమస్యలను గుర్తించి, పిల్లలకు తగిన సహాయం అందించడానికి ఈ అధ్యయన ఫలితాలు దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.