35 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేధం విధించిన కేంద్రం
సాక్షి లైఫ్ : కేంద్ర ప్రభుత్వం, ప్రజా ఆరోగ్య రక్షణ కోసం 35 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీపై నిషేధం విధించింది. ఈ ఔషధాల్లో పెయిన్ కిల్లర్స్ , న్యూట్రిషనల్ సప్లిమెంట్స్,యాంటీ-డయాబెటిక్ ఔషధాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ అధికారులకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తగ్గించే కరివేపాకు : గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..భారత్‌లో కొత్త రకం డయాబెటిస్.. 'టైప్-5'.. ఎలాంటివాళ్లకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..మొక్కల ఆధారిత అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఈ ఔషధాలు ముందస్తు పరీక్షలు లేకుండా తయారీతోపాటు విక్రయాలు జరుగుతున్నాయని, ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తాయని సీడీఎస్‌సీఓ గుర్తించింది. ఈ ఔషధాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సక్రియ ఔషధ పదార్థాల (ఏపీఐలు) కలయికను కలిగి ఉంటాయి.
రాష్ట్ర ఔషధ లైసెన్సింగ్ అధికారులు ఈ ఔషధాలకు గతంలో లైసెన్సులు జారీ చేసినప్పటికీ, వీటి సేఫ్టీ, ఎఫిసెన్సీపై సీడీఎస్‌సీఓ ఆమోదం తెలుప లేదని తేలింది. ఈ నేపథ్యంలో, ఔషధ నియంత్రణ ప్రక్రియను సమీక్షించి, 1940 ఔషధ, సౌందర్య చట్టం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సీడీఎస్‌సీఓ సూచించింది.
ప్రజలు ఆరోగ్యకరమైన ఔషధాలను మాత్రమే ఉపయోగించాలని, అనధికార ఔషధాల వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఇలాంటి మెట్రెస్ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పెరిగిన డీహైడ్రేషన్ డ్రింక్స్ విక్రయాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
