కొలెస్ట్రాల్‌ను తగ్గించే కరివేపాకు : గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..
సాక్షి లైఫ్ : రోజూ వంటల్లో ఉపయోగించే కరివేపాకు కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కరివేపాకు సమర్థవంతంగా పనిచేస్తుందని వారు వెల్లడిస్తున్నారు. కరివేపాకు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
కరివేపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బి, సి, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలను పెంచుతాయి. రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు రసం తాగడం లేదా 8 నుంచి 10 ఆకులను నమలడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయని ఆయుర్వేద వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
అంతేకాదు, కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. కరివేపాకు టీ లేదా కరివేపాకు పొడిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
